తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఎవరికీ అర్ధం కావు. ఆయన ఏం చేసినా పక్కాగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో ఉంది. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఇటీవల ముగిసిన తెలంగాణ ముందస్తు ఎన్నికలే అంటున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర రావును గద్దె దించేందుకు ప్రతిపక్షాలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు, తెలంగాణ జన సమితి, సిపిఐ జత కలిసాయి. అయితే ఆ పార్టీలో ఉద్దండులైన వారు కూడా కల్వకుంట్ల వారి ఎత్తుగడలను తట్టుకోలేక ఓటమి పాలయ్యారు. దేశంలోనే అందరి కంటే సీనియర్ నాయకుడి అని మాటిమాటికి చెప్పుకుంటున్న చంద్రబాబునే బూచిగా చూపించి అద్భుత విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావును పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఇది కూడా వ్యూహంలో భాగమే అని అంటున్నారు. తాను జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్నానని, దీనిని దృష్టిలో ఉంచుకుని పార్టీ వ్యవహారాలు చూసేందుకు తన కుమారుడికి పార్టీ కార్యకలాపాలు అప్పగించినట్లు చెబుతున్నారు. తన కుమారుడికి పార్టీలో ఉన్న ఏకైక పోటీదారు తన మేనల్లుడు హరీష్ రావు అని కేసీఆర్ కు తెలుసు. దీంతో హరీష్ నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా కేసీఆర్ ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో ప్రభుత్వం వచ్చినా ఇంకా మంత్రి వర్గ విస్తరణ మాత్రం ఇంకా పూర్తిగా చేయలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని అంటున్నారు. అదే జరిగితే తన మేనల్లుడు హరీష్ రావుకు ప్రాధాన్యత లేని శాఖ ఏదైనా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీని వల్ల మంత్రి పదవి ఇవ్వలేదనే అపవాదు రాదని, ప్రాధాన్యత లేని శాఖ అయితే ఆయన నుంచి కుమారుడికి పోటీ కూడా ఉండదన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఈ శాఖకు అంత ప్రాధాన్యం ఉండదు. పైగా శాసనసభలో ప్రతిపక్షం కూడా చెప్పుకోతగ్గ సంఖ్యలో లేదు. దీంతో హరీష్ రావుకు పెద్దగా పని కూడా ఉండదని అంటున్నారు. శాసనసభ జరిగినప్పుడో, ఏదైనా వివాదం వచ్చినప్పుడో మాత్రమే శాసనసభ వ్యవహారాల మంత్రి అవసరం ఉంటుంది. మిగిలిన సమయాల్లో ఆ శాఖ మంత్రి కేవలం శాసనసభ్యుడుగానే ఉంటారు. ఈ శాఖను హరీష్ రావుకు ఇస్తే అటు మంత్రి పదవి ఇచ్చినట్లు, ఇటు తన కుమారుడికి అడ్డు తొలగించినట్లు ఉంటుందన్నది కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు.
Full View