రష్యా పూర్తిగా ఫెయిలయ్యిందా ?

Update: 2022-04-15 04:28 GMT
ఉక్రెయిన్ కు విదేశాల నుండి ఆయుధాలను అందకుండా చేయటంలో రష్యా ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిలయ్యిందా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే రష్యా ముందు ఉక్రెయిన్ అనే దేశం చిట్టెలుక లాంటిది. ఏ విధంగా చూసినా రష్యా ముందు ఉక్రెయిన్ నిలవలేందు.

ప్రస్తుత యుద్ధంలో తనంతట తానుగా యుద్ధం చేయాలంటే మహాఅయితే రష్యాను ఎదిరించి ఉక్రెయిన్ నాలుగైదు రోజులకన్నా నిలబడలేందు. అయినా నలబైరోజులుగా యుద్ధం జరుగుతునే ఉందంటే అందుకు కారణం ఏమిటి ?

కారణం ఏమిటంటే ఉక్రెయిన్ కు నాటో దేశాలు, అమెరికా తదితర దేశాల నుండి భారీ ఎత్తున ఆయుధాలు అందుతుందటమే. ఆయుధాలు అందుతున్నాయన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు.

అయితే ఆ ఆయుధాలు ఎలా అందుతున్నాయి ? ఏ ఏ మార్గాల్లో ఉక్రెయిన్ కు ఆయుధాలు చేరుతున్నాయనే విషయాన్ని పసిగట్టడంలో రష్యా ఇంటెలిజెన్స్ నూరుశాతం ఫెయిలైనట్లే అనిపిస్తోంది.ఉక్రెయిన్ పొరుగు దేశాలైన పోలండ్, లాత్వియా, లుధివేనియా లాంటి దేశాల నుండి ఉక్రెయిన్ లోకి యధేచ్చగా ఆయుధాలందుతున్నాయి.

ఉక్రెయిన్లో రష్యాకు పటిష్టమైన గూఢచార వ్యవస్ధ లోపించటం వల్లే ఇలాంటి పరిస్ధితి తలెత్తిందని అర్ధమవుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ కు జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా, స్వీడన్ లాంటి అనేక దేశాల నుండి ఆయుధాలు అందుతున్నాయి. అమెరికా నుండి అందిన స్టింగర్ క్షిపణ వ్యవస్ధ , జావెలిన్ అనేక క్షిపణల ద్వారా మాత్రమే రష్యాకు చెందిన కొన్ని యుద్ధ విమానాలను, ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ సైన్యం కూల్చేసింది.

ఇదే కాకుండా  రష్యాకు చెందిన అనేక యుద్ధ ట్యాంకులను కూడా ధ్వంసంచేసింది. ఇవన్నీ కూడా విదేశాల నుండి అందిన సాయం కారణంగా ఉక్రెయిన్ సైన్యం సాధించింది. ఉక్రెయిన్ గగనతలంపై రష్యా పట్టుసాధించలేకపోవటం, ఉక్రెయిన్ సరిహద్దులపై రష్యాకు పట్టులేకపోవటమే దీనికి ప్రధాన కారణం. మొత్తంమీద ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా ఫెయిల్యూర్ స్పష్టంగా కనబడుతోంది. ఇన్ని వైఫల్యాలతో రష్యా ఇంకా ఎన్నిరోజులు ఉక్రెయిన్  పై యుద్ధం చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News