శిష్యుని ఫార్ములనే ఫాలో అవుతారా...!?

Update: 2018-12-19 06:13 GMT
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబుబు నాయుడి కి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశే‌‌ఖరావు ఓ విధంగా శిష్యుడు. దీనిని కేసీఆర్‌ అంగీకరించక పోయినా ఇది మాత్రం చారిత్రక సత్యం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కేసీఆర్‌ కు మంత్రి పదవి ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఒక విధంగా చూస్తే కేసీఆర్‌ కు తెలుగుదేశం అభ్యర్దిగా బీ-ఫార్మ్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ విధంగా కల్వకుంట్ల చంద్రశే‌ఖర రావు చంద్రబాబుకు మిత్రుడే. సరే, ఇదంతా పక్కన పెట్టి అసలు విషయానికి వద్దాం.. తెలంగాణలో రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రాజకీయాలలో కీలకం కావడం కోసం కేసీఆర్ తన కుమారుడి కి కల్వకుంట్ల తారక రామారావు కు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఇచ్చారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే పరిణామాలను బట్టి తారక రామారావు ను తెలంగాణ ముఖ్యమంత్రి ని చేసే అవకాశాలు ఎక్కువగా ఉందంటున్నారు. ఈ విషయంలో కె. చంద్రశేఖర రావు చాల వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తు లో  తన కుమారుడి కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తాను ఢిల్లీలోను, తన కుమారుడు తెలంగాణ లోను చక్రం తిప్పాలన్నది కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనగా చెబుతున్నారు. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన శిష్యుడి ఫార్ములానే అమలు  చేయాలని భావిస్తునట్లు సమాచారం.

2019 ఏప్రీల్, మే నెలలలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోక్‌సభ కు ఎన్నికలు జరగనున్నాయి. నారా చంద్రబాబు నాయుడు కూడా బిజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్దాయి లో చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ లో తన శిష్యుడు కేసీఆర్ ఆయన కుమారుడికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లుగా చంద్రబాబు నాయుడు కూడా ఆయన కుమారుడు నారా లోకేష్‌ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలను బట్టి తన కుమారుడు లోకేష్‌ ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. శిష్యుడి ఫార్ములా గురువు పాటించినా ఫలితం మాత్రం అనుకూలంగా వస్తుందని నమ్మకం లేదంటున్నారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో అనేక మంది సినీయర్లు ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర సమితి లో మాత్రం కేసీఆర్ మాటే చెల్లుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News