మొదటి విడత పోలింగ్ అయిన వెంటనే బీజేపీ వ్యూహం మార్చేసినట్లు కనబడుతోంది. అంత వరకు శాంతి భద్రతల సమస్య, అభివృద్ధి పైన బాగా ప్రచారం చేసిన బీజేపీ నేతలంతా ఇపుడు హఠాత్తుగా హిందుత్వ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. దీనికి కారణం ఏమిటంటే మొదటి విడత పోలింగ్ లో బీజేపీకి సానుకూలంగా ఫలితాలు వచ్చేది అనుమానమే అని తేలిందట.
పశ్చిమ యూపీలోని 128 సీట్లకు గాను మొదటి విడత పోలింగ్ లో 58 సీట్లకు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ లో బీజేపీకన్నా ఎస్పీ కూటమికే ఎక్కువ సీట్లు వస్తాయని తేలిందట.
ఇదే సమయంలో కర్నాటకలోని ఉడిపి కాలేజీలో హిజాబ్ వివాదం బాగా రాజుకుంది. కర్నాటకలో మొదలైన వివాదం చాలా త్వారగా ఎనిమిది రాష్ట్రాలకు పాకింది. ఇందులో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఎలాగూ ఎన్నికలు జరుగుతున్నాయి, అభివృద్ధి మంత్రం పనిచేసేట్లు లేదని కమలనాథులకు అర్ధమైపోయినట్లుంది.
అందుకనే హిందుత్వ వాదంతో పాటు హిజాబ్ వివాదాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తీసుకొచ్చారట. ఈ నేపధ్యంలోనే రెండో విడత పోలింగ్ కూడా జరిగింది. మరి రెండో విడతలో బీజేపీకి ఏ మాత్రం సానుకూలత ఉందనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా నాలుగు విడతల పోలింగ్ ఉంది కాబట్టి ఇక ఛాన్స్ తీసుకోదలచుకోలేదట. అందుకనే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుని హిందువులు, ముస్లింలనే వాదన పట్టుకొచ్చిందిట.
2017లో కూడా హిందువులు, ముస్లింలు, ముస్లింలకు సాయం చేస్తున్నవారు అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్ళే బీజేపీ లాభపడింది. రెండోసారి అధికారంలోకి రావాలంటే మళ్ళీ హిందుత్వ అజెండాను తీసుకురావటం ఒకటే మార్గమని కమలనాథులకు బాగా అర్ధమైపోయిందట. ఎంత విచిత్రమంటే హైదరాబాద్ లోని గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే స్ధాయికి దిగజారిపోయారు.
బీజేపీకి ఓట్లేస్తే సరి లేకపోతే ఫలితాలు వచ్చిన తర్వాత బుల్డోజర్లు, జేసీబీలే సమాధానం చెబుతాయని బెదిరించటమే ఆశ్చర్యంగా ఉంది. హైదరాబాద్ లోనే ఇలాగుంటే ఇక యూపీలో హిందుత్వ అజెండా ఎలాగుంటుందో అర్ధమైపోతోంది.