ఎంపి విషయంలో ఇదే ఇంపార్టెంట్ అయిపోయిందా ?

Update: 2021-05-18 07:30 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసింది ఒక అంశంపైన అయితే ఇపుడు రాజకీయాలను కుదిపేస్తున్నది మాత్రం మరో అంశం. ప్రభుత్వం+జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎంపి రఘురామ దూషించటం, కుల-మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయటం వగైరా ఆరోపణలపై అరెస్టుచేసింది సీఐడీ.

శుక్రవారం సాయంత్రం నుండి శనివారం సాయంత్రం వరకు ఇదే అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే శనివారం సాయంత్రానికి సీన్ మొత్తం మారిపోయింది. శనివారం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టుకు విచారణ నిమ్మితం వచ్చిన ఎంపి తానున్న గదిలోకి ఐదుగురు వ్యక్తులు శుక్రవారం రాత్రివచ్చి కాళ్ళపై బాగా కొట్టారని చేసిన ఆరోపణ సంచలనమైపోయింది.

ఎప్పుడైతే తనను కొట్టారని రఘురామ ఆరోపణ చేశారో అప్పటి నుండి సోమవారం రాత్రివరకు కూడా ఇదే అంశంపై రాజకీయాలు భగ్గుమన్నాయి. రఘురామకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు అన్నీ రాజకీయపార్టీలు ఏకమైపోయాయి. చంద్రబాబునాయుడు అయితే ఏకంగా ఎంపిని కొట్టారంటు రాష్ట్రపతికి ఫిర్యాదుచేసేశారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, జనసేనాని పవన్ కల్యాణ్, సీపీఐ కార్యదర్శి రామకృష్ణలు ఏకమైపోయారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంపిని పోలీసులు కొట్టలేదని ఆయనకున్న ‘ఎడీమా’ అనే సమస్య వల్లే కాళ్ళల్లో వాపులు, అరిపాదాల రంగుమారిందని కోర్టు నియమించిన మెడికల్ బోర్డు నిర్ధారించింది. ఎడీమా అంటే కాళ్ళల్లోని టిష్యుల్లో అవసరానికన్నా ఫ్యూయిడ్లు ఎక్కువగా చేరిపోవటం. మెడికల్ బోర్డు స్పష్టంగా ఎంపి సమస్య ఇది అని వివరించింది.

మెడికల్ బోర్డు వివరించినా ఇంకా సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రి నిపుణులు ఎంపిని పరీక్షించాల్సుంది. అయితే మెడికల్ బోర్డు రిజల్టును ప్రతిపక్షాలు, జగన్ వ్యతిరేక మీడియా పట్టించుకోవటంలేదు. మొత్తానికి ప్రభుత్వంపై ఎంపి ‘హెట్ స్పీచ్’ అనే అసలు అంశం కాస్త పక్కకుపోయి ఎంపిని కొట్టారు అనే కొసరు అంశమే ప్రధానమైపోయింది. మరి ఆర్మీ వైద్య నిపుణులు పరీక్షలు జరిపేంతవరకు పరిస్ధితి ఇలాగే ఉంటుందేమో.
Tags:    

Similar News