ప్రతిపక్షాల ఐక్యతేంటో బయటపడిందా ?

Update: 2022-08-08 05:52 GMT
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత ఏమిటో బయటపడింది. అంటే ఇంతకుముందు కూడా కొన్ని పార్టీల మధ్య భేదాభిప్రాయాలున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో అన్నీ పార్టీలు కలిపి ఎలాంటి ప్రోగ్రాములు చేయలేదు. కాబట్టి నాన్ ఎన్డీయే పార్టీల్లో చాలా పార్టీలు దేనికదే అన్నట్లుగా ఉంటున్నాయి. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలనేసరికి నాన్ ఎన్డీయే పార్టీలన్నీ ఏకం కావాలంటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నిజానికి కాంగ్రెస్ భాగస్వామ్యం లేకుండా, హస్తం పార్టీ నాయకత్వం లేకుండా ఎన్డీయేని ఎదిరించేందుకు నాన్ ఎన్డీయేలకు సరైన వేదిక లేదు. అయితే కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సహించేందుకు మమత ఏమాత్రం అంగీకరించటం లేదు. దాంతో రెండు పార్టీలు అంటీముట్టనట్లు గానే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటిది రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు దగ్గరకు చేరాయి. దీంతో నాన్ ఎన్డీయే పార్టీల్లో చాలావరకు ఏకమయ్యాయయనే చెప్పాలి.

అయితే ఎన్డీయే తరపున పోటీ చేసిన ద్రౌపదిముర్ము నేపథ్యం కారణంగా యూపీఏతో పాటు నాన్ ఎన్డీయేలోని కొన్ని పార్టీలు ద్రౌపదికి మద్దతుగా నిలిచాయి. దాంతో నాన్ ఎన్డీయే అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఓడిపోయారు. సిన్హా ఓటమి అందరికీ ముందే తెలుసు.

అయితే నాన్ ఎన్డీయే పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయని నిరూపించేందుకే రాష్ట్రపతి ఎన్నికను ఉపయోగించుకోవాలని అనుకున్నాయంతే. సరే దీని తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నిక వచ్చేసరికి సీన్ మారిపోయింది. రాష్ట్రపతి ఎన్నిక అయిపోయే వరకు యాక్టివ్ గా ఉన్న మమత ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించారు.

అదేమంటే ఉపరాష్ట్రపతిగా కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరెట్ ఆల్వాను ఏకపక్షంగా ఎంపికచేశారని ఆరోపణలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ విధానాన్ని వ్యతిరేకంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు సొల్లు చెప్పింది.

దీంతోనే నాన్ ఎన్డీయే పార్టీల మధ్య ఐక్యత ఎంతనేది బయటపడింది.  తాజా ఎన్నికల్లో నాన్ ఎన్డీయే పార్టీల మధ్య ఐక్యతనేది ఒక మిథ్యగా అర్ధమైపోయింది. రేపటి 2024 ఎన్నికల్లో కూడా ఇదే పద్దతి కంటిన్యూ అవుతుందనటంలో సందేహం లేదు.  నరేంద్రమోడీ వ్యతిరేకత అనేది తప్ప నాన్ ఎన్డీయే పార్టీలను కలిపేందుకు మరో కారణం లేకపోవటంతోనే ఐక్యత సాధ్యం కావటం లేదు.
Tags:    

Similar News