బోల్డ్ ఫోటోతో షాకిచ్చిన షమీ సతీమణి..రియాక్షన్ ఇదే

Update: 2021-08-20 02:42 GMT
మిగిలిన క్రికెటర్ల సతీమణులకు భిన్నం టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్. భర్తతో ఉన్న విభేదాల విషయాన్ని రోడ్డు మీదకు వచ్చి న్యాయం కోసం పోరాడిన వైనం ఒక ఎత్తు అయితే.. షమీ మీద చేసిన ఆరోపణల్ని ఆమె నిరూపించకపోవటంతో విమర్శల్ని ఎదుర్కొన్నారు. భర్తతో గొడవలుంటే తేల్చుకోవాలే కానీ.. ఇలా ఇరుకున పెట్టేసేలా హడావుడి చేయటం ఏమిటని అభ్యంతరాలు వ్యక్తం చేయటం తెలిసిందే. హసీన్ చేసిన రచ్చతో ఒక దశలో షమీ కెరీర్ ప్రమాదంలో పడింది. చివరకు సర్దుకున్న సంగతి తెలిసిందే.

గొడవలైన తర్వాత నుంచి షమీ.. హసీన్ లు విడిగా ఉంటున్నప్పటికి విడాకులు మాత్రం తీసుకోలేదు. 2014 ఏప్రిల్ లో వివాహం జరిగిన వీరు ఇప్పుడు ఎవరికి వారుగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హసీన్ జహాన్.. తరచూ తన ఫోటోల్ని.. వీడియోల్ని పోస్టు చేస్తుంటారు. ఆమెకు దాదాపు లక్ష మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఏమైందో ఏమో కానీ.. తన తీరుకు భిన్నంగా తాజాగా ఆమె పోస్టు చేసిన బోల్డ్ ఫోటో అందరికి షాకిచ్చింది.

మోడల్స్.. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వారు పోస్టు చేసే ఫోటోలకు ఏ మాత్రం తగ్గని బోల్డ్ ఫోటోను పోస్టు చేసేసి కొత్త చర్చకు తెర తీసింది. ఈ ఫోటోను బాగుందని కామెంట్ చేస్తున్న వారు కొందరైతే.. ఇదేం పోయే కాలం అంటూ మరికొందరు దారుణంగా తిట్టిపోస్తున్నారు. వైట్ కలర్ రగ్గడ్ జీన్స్.. బ్లాక్ టాప్ ధరించిన ఆమె.. తన అందాల్నికూసింత బహిర్గతం చేసే హాట్ ఫోటోను షేర్చేశారు. గ్లామర్ అందాల్ని బహిర్గతం చేసేలా ఉన్న ఆమె ఫోటో హాట్ టాపిక్ గా మారింది. పెళ్లై ఒక బిడ్డకు తల్లివి అయ్యావ్.. అయినా కూడా ఇంత ఎక్స్ పోజింగ్ అవసరమా? అని అసహనాన్ని వ్యక్తం చేస్తే.. కొందరు మాత్రం చాలా బాగున్నారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడీ ఫోటో వైరల్ గా మారింది. మరి.. ఒక ఫోటోతోనే ఆపుతుందా? లేదంటే రానున్న రోజుల్లో ఈ డోసు మరింత పెంచితే మాత్రం రచ్చ రచ్చే అవుతుందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News