హత్రాస్ కేసు: డీఐజీ భార్య ఆత్మహత్య

Update: 2020-10-25 09:50 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ బాలిక హత్యాచారం జరిగిన పర్యవసనాలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హత్రాస్ కేసును దర్యాప్తు చేస్తోన్న సిట్ డీజీపీ భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీనికి గల కారణాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

హత్రాస్ కేసు దర్యాప్తుకు గాను యూపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ చంద్రప్రకాష్ సిట్ సభ్యుల్లో ఒకరు. తాజాగా ఆయన భార్య పుష్ప ప్రకాష్ (36) శనివారం ఉదయం 11 గంటల ప్రాంతాల్లో లక్నోలోని వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను లోహియా ఆస్పత్రికి తరలించారు.

పుష్ప ప్రకాష్ ని పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మరణించిందని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి గల కారణాలపై ఆరాతీస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని.. ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ తెలిపారు. 2005 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన చంద్రప్రకాష్ ప్రస్తుతం హత్రాస్ కేసు దర్యాప్తు కోసం నియమించిన సిట్ లో సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.
Tags:    

Similar News