మరణంపై ప్రపంచ కుబేరుడి మాటలు విన్నారా?

Update: 2022-03-28 05:43 GMT
దేని గురించైనా ఇట్టే మాట్లాడేసే ప్రముఖులు.. మరణం గురించి మాట్లాడాలంటే ఎక్కువ ఆసక్తి చూపించరు. ఆ మాటకువస్తే.. మనిషి జీవితంలో కీలకమైన.. భయంకరమైన.. ఎవరూ అస్సలు కోరుకోనిది ఏమైనా ఉందంటే అది మరణమే. చావు గురించి పెద్దగా మాట్లాడని వారికి భిన్నంగా ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రం ఫుల్ క్లారిటీతో మాట్లాడారు.

అది ఇది అన్న తేడా లేకుండా అనేక ప్రయోగాలకు తెర తీసే ఆయన.. మరణాన్ని కాస్తంత పోస్టు పోన్ వేసి.. మనిషి జీవితాకాలాన్ని పెంచే అంశంపై ప్రయోగాలకు ఏమాత్రం ఆసక్తిని చూపించకపోవటం గమనార్హం.

అంతేకాదు.. మరణాన్ని వాయిదా వేసేస్తూ.. జీవిత కాలాన్ని పెంచేలా చేస్తే సమాజ పురోగతి అడ్డుకుంటుందని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణాన్ని వాయిదా వేసినట్లైయితే.. మానవ పురోగతిని కూడా వాయిదా వేసినట్లే అవుతుందని పేర్కొన్నారు.

చాలామంది తమ మనసుల్ని మార్చుకోవటానికి సిద్ధంగా ఉండరని.. అలాంటి వారు చివరకు చనిపోతారని.. ఒకవేళ వారు చనిపోకపోతే తమ పాత ఆలోచనల్లోనే కూరుకుపోయి ఉంటారన్నారు అలాంటిది జరిగితే సమాజం ముందుకు వెళ్లలేదన్న సత్యాన్ని వెల్లడించారు.

మరణాన్ని వాయిదా వేసి.. జీవితకాలం పెరిగినట్లైయితే.. పాత ఆలోనల్లోనే కూరుకుపోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. చాలా దేశాలు వృద్ధ నాయకత్వాల చేతుల్లోనే ఉన్నాయని చెప్పిన మస్క్.. అమెరికాతో పాటు చాలా దేశాల్లో పెద్ద వయస్కులైన నాయకుల చేతుల్లోనే ఉందన్నారు. ఒకవేళ వారు చాలా తరాలు పెద్ద వారు అయిన పక్షంలో అలాంటి వారి వ్యక్తులతో సానిహిత్యంతో ఉండటం కుదరదన్నారు.

అంతేకాదు.. ఈ సందర్భంగా ఆయనో కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చారు. ఒక దేశాన్ని పాలించేందుకు ఏ రీతిలో అయితే కనిష్ఠ వయసును పెడతారో.. గరిష్ఠ వయసు కూడా ఉండాలన్నారు. మరణానికి తానుభయపడనని తేల్చిన ఎలాన్ మస్క్.. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నాలు చేస్తానే తప్పించి.. మరణానికి మాత్రం భయపడనని చెప్పారు. ఏమైనా.. అందరూ మాట్లాడేందుకు పెద్ద ఆసక్తిని చూపని మరణంపై ఎంత క్లారిటీగా మాట్లాడారో కదా?
Tags:    

Similar News