తల్లిని చంపిన కీర్తి జైల్లో ఎలా ఉంది? ఏం చేస్తోంది?

Update: 2019-11-03 04:39 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన కీర్తి వ్యవహారం ఇప్పుడు జైలు వద్దకు వెళ్లటం తెలిసిందే. ప్రియుడి మోజులో పడి కన్నతల్లిని కర్కశంగా చంపే విషయంలో అతని మాటల్ని తూచా తప్పకుండా ఫాలో అయిన ఆమెను చంచలగూడ జైలుకు తరలించారు. మైనార్టీ తీరిన నెల వ్యవధిలోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడటం.. అప్పటికే అబార్షన్ అయిన కీర్తి జైల్లో ఎలా ఉంది?

పోలీసుల విచారణలో దాదాపు మూడు.. నాలుగు రోజులు ఉన్న ఆమెలో ఎలాంటి పశ్చాతాపం లేదని.. పోలీసుల చెర నుంచి జైల్లోకి వెళుతున్న వేళలో.. బై సార్.. మళ్లీ కలుస్తా అంటూ వెళ్లినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జైల్లో ఆమె తీరు ఎలా ఉంటుంది? అన్నది ప్రశ్నగా మారింది. ఈ విషయం మీద ఫోకస్ చేస్తే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

జైలుకు వెళ్లిన తొలిరోజున కీర్తిలో ఎలాంటి భయం.. జంకూ లేవని.. అలాంటివేమీ ఆమెలో కనిపించనట్లు చెబుతున్నారు. బెరుకు లేకుండా ఇతర ఖైదీలతో సాధారణంగా మాట్లాడుతున్న వైనానికి అధికారులు సైతం విస్తుపోతున్నట్లు తెలుస్తుంది. సాధారణంగా జైలుకు వచ్చిన వారు.. మొదట తమదైన లోకంలో ఉండటం.. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటం.. తమకీ పరిస్థితిలోకి ఎందుకు వచ్చామన్న వేదనలో ఉండటం లాంటివి చేస్తుంటారు. కానీ.. ఇందుకు భిన్నంగా కీర్తి తీరు ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన కీర్తి విషయంలో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండటమే కాదు.. ఆమెపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలుస్తోంది. జైల్లోని మహిళా ఖైదీల్లో కొందరు సత్ఫప్రవర్తనతో ఉన్న వారి బ్యారక్ లో కీర్తిని ఉంచినట్లు తెలుస్తోంది. ఆమె వ్యవహారశైలి ఎలా ఉంది? ఏం మాట్లాడుతుందన్న విషయం మీద జైలు అధికారులు ఒక కన్నేసి ఉంచినట్లుగా సమాచారం.

తల్లిని ఎందుకు చంపాల్సి వచ్చిందన్న విషయాన్ని.. తనకు ఎదురైన పరిస్థితుల్ని దాచకుండా చెప్పేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరేం అడిగినా.. తడుముకోకుండానే వివరాలు చెప్పేస్తున్న్లు తెలుస్తోంది. ఆమెకు జైలు అధికారులు ప్రత్యేక కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు చెబుతున్నారు. కీర్తి మానసిక పరిస్థితిని అంచనా వేసేందుకు ఆమెను ఎర్రగడ్డ మానసిక చికిత్సాలాయానికి తరలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News