ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్లీలో సంక్షోభం ముదిరింది. తిరుగుబాటు చేసిన మాజీ మంత్రి కపిల్ మిశ్రా మరో సంచలనం సృష్టించారు. మంత్రివర్గం నుంచి కపిల్ మిశ్రాను తొలగించిన విషయం విదితమే. అనంతరం కపిల్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ.. మంచినీటి ట్యాంకర్ల స్కాంలో కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు కేజ్రీవాల్ తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకున్న విషయాన్ని రుజువు చేపిస్తానని చెప్పారు.ఇంట్లోనే డబ్బులు తీసుకుంటుండగా తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. కేజ్రీవాల్ అన్ని అబద్దాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఆప్ నుంచి అవినీతిని తొలగించాలన్నదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. తాను పార్టీలోనే ఉంటా.. అవినీతిపై పోరాడుతానని తేల్చిచెప్పారు. కేజ్రీవాల్ అవినీతిపై సీబీఐని ఆశ్రయిస్తానని తెలిపారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు.
తాజగా ఆయన సంచలన చర్య చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ పై ఎమ్మెల్యే కపిల్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 శాతం కూడా హాజరుకాలేదని, ముఖ్యమంత్రి జీతంలో కోత విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
కాగా, గతంలో మిశ్రాకు తీవ్ర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసిన మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మిశ్రా సభకు వచ్చారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సభాపతిని కోరారు. సీఎం కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేలకు - కపిల్ మిశ్రాలకు సభలో వాగ్వాదం జరిగింది. మిశ్రాపై కొందరు ఎమ్మెల్యేలు చేయిచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.