అజారుద్దీన్ కు షాకిచ్చారు.. అధ్యక్ష పదవిపై వేటు వేశారు

Update: 2021-06-17 03:30 GMT
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (సింఫుల్ గా హెచ్ సీఏ) లో వివాదం మరింత ముదిరింది. గడిచిన కొంతకాలంగా హెచ్ సీఏలోని గ్రూపుల మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తరచూ జరుగుతున్న గొడవలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తమ అధిక్యతను ప్రదర్శించుకోవాలన్న తపన ఎక్కువైంది. ఇలాంటి వేళ.. అనూహ్యంగా హెచ్ సీఏ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అజారుద్దీన్ పైన వేటు పడింది. గతంలోటీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావటం.. ఆ వివాదంతో అతగాడి ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయ్యింది. క్రికెట్ అనంతరం కాంగ్రెస్ లో చేరారు. రాజకీయాల్లోకొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఆయనపై కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతూ..  ఈ నెల రెండున హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతేకాదు.. హెచ్ సీఏలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని అజార్ ఖండిస్తున్నారు. తాజాగా అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ ఏ విధంగా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఏప్రిల్ 11న హెచ్ సీఏ సర్వసభ్య సమావేశం జరిగింది.

ఇందులో విజయానంద్ కు అజార్ కు మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో 130 మంది క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకానికి సంబంధించి వ్యవహారంలో స్టేజ్ మీదనే అజారుద్దీన్.. విజయానంద్ పబ్లిక్ గానే ఘర్షణ పడ్డారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజార్ ప్రోత్సహించటం లేదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత సైతం హెచ్ సీఏలో జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేయటంతో పాటు హెచ్ సీఏలో ప్రక్షాళన చేస్తామని చెబుతున్నారు. ఈ క్రమంలో అజార్ పై వేటు పడటం సంచలనంగా మారింది. ఇప్పటివరకు హెచ్ సీఎల్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్న అజార్.. క్రమంగా తన పట్టుకోల్పోతున్నారని.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఇందుకు నిదర్శనంగా వ్యాఖ్యానిస్తున్నారు. తనపై వేటు వేసిన వైనంపై అజార్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News