ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సటీ విద్యార్థి రోహత్ కు న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న నిరసన తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకూ నిరసన.. ఆందోళన చేపట్టిన విద్యార్థులు.. తాజాగా ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. గురువారం నుంచి వారు ఆమరణ దీక్ష చేపడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్లు ఏమిటి? వారేం కోరుకుంటున్నారు? విద్యార్థుల నిరసన తగ్గాలంటే ఏం చేయాల్సి ఉంటుందన్న అంశంలోకి వెళితే.. విద్యార్థుల ప్రధాన డిమాండ్లు
= రోహిత్ మృతికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ.. బండారు దత్తాత్రేయలు తమ పదవులకు రాజీనామా చేయాలి
= సెంట్రల్ యూనివర్సిటీ వీసీ.. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు తమ పదవులకు రాజీనామా చేయాలి
= రోహిత్ మృతికి రూ.5కోట్లు నష్ట పరిహారం ఇవ్వాలి
= రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం
= ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ ను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలి
= రోహిత్ తో పాటు సస్పెండ్ అయిన నలుగురు విద్యార్థులపై ఉన్న కేసులు ఎత్తివేసి.. వర్సిటీ తీసుకున్న చర్యల్ని ఉపసంహరించుకోవాలి