మీరు గమనించారో లేదో.. చాలామందికి ఇంట్లో ఉండే బాత్రూం పెద్ద శాపంగా మారుతూ ఉంటుంది. వేలాది కోట్లు ఉన్న వారిలో చాలామంది బాత్రూం వారిని బలి తీసుకుంటూ ఉంటుంది. ఆ మధ్యన మీడియాలోనే మొనగాడిగా పేరున్న పెద్ద మనిషి ఇంట్లోని బాత్రూంలో జారిపడ్డారు. దాదాపు నాలుగైదు నెలల పాటు బెడ్ మీద గడిపిన ఆయన్ను చికిత్సలో భాగంగా ఆసుపత్రికి తరలిస్తే.. అక్కడ మరోసారి బాత్రూంలో జారి పడటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.
మీడియా పెద్ద మనిషిగా జాతీయస్థాయిలో పేరున్న ఆయన..బాత్రూంలో జారి పడటమా? అనుకున్నోళ్లు లేకపోలేదు. ప్రభుత్వాల్ని కూడా శాసించే పవర్ ఉన్నట్లు చెప్పే ఆయన.. ఇంట్లోని బాత్రూం జారి పడటం అందరి నోట నానింది. ఆ మాటకు వస్తే చాలామంది సంపన్నులు.. పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వారు మాత్రమే కాదు.. సామాన్య ప్రజానీకంలో ఎక్కువ మంది బాత్రూంలో జారి పడుతూ మంచాన పడుతుంటారు.
తాజాగా మాజీ ప్రధానిగా సుపరిచితులు.. అన్నికలిసి వస్తే.. రానున్న రోజుల్లో మరోసారి ప్రధాని పదవి చేపట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్లు చెప్పే హెచ్ డీ దేవేగౌడ తాజాగా తన ఇంట్లోని బాత్రూంలో జారి పడినట్లుగా చెబుతున్నారు. బెంగళూరులోని పద్మనాభ నగరలోని తన ఇంట్లోని బాత్రూంలో ఆయన జారి పడ్దారు. శుక్రవారంరాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన.. ఇంట్లోని బాత్రూంలో జారి పడగా.. ఆయన ఎడమకాలు బెణికినట్లుగా చెబుతున్నారు. కాలు నొప్పి ఎక్కువ కావటంతో దేవెగౌడను ఆసుపత్రికి తరలించారు. కాలి నొప్పి మాత్రమేఉందని.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎలాంటి ఆందోళన వద్దంటూ దేవెగౌడ్ చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. మరో నాలుగు రోజుల్లో దేవెగౌడ కాలు నొప్పి మొత్తంగా పోతుందని చెబుతున్నారు.