సినిమాలని అనుకరిస్తూ వాటిని తమ జీవితాలకి యూత్ అన్వయించుకుంటున్న రోజులివి. ఇదే పంథాలో తమిళంలో రూపొందిన 'లవ్ టుడే' సినిమాని ఫాలో అయ్యాడో తమిళ అభిమాని. యువ తరం ఆలోచనల నేపథ్యంలో రూపొందిన మూవీ ఇది. ప్రదీప్ రంగనాథన్ దర్శకుడు, కథకుడు, హీరో కూడా. తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే మూవీని అదే పేరుతో తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేశారు.
ఆసక్తిని రేకెత్తించే ట్రైలర్, దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ రిలీజ్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుండటంతో ప్రేక్షకులు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే అ మూవీకి బ్రహ్మరతం పట్టారు.
ఐటీ ఉద్యోగి అయిన ఉత్తమన్ ప్రదీప్, నిఖిత ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ ని పెళ్లిదాకా తీసుకెళతారు. అక్కడే అసలు చిక్కొచ్చి పడింది. నిఖిత తండ్రి శాస్త్రి వీరి ప్రేమని తెలుసుకుని ఒక రోజు ఉత్తమన్ ప్రదీప్ ని ఇంటికి ఆహ్వానిస్తాడు. ప్రేమని అంగీకరించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.
అయితే ఈ క్రమంలో ఓ కండీషన్ పెడతాడు. 24 గంటల పాటు ఒకరి ఫోన్ ఒకరి వద్ద వుండాలంటాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఆ తరువాత ఏం జరిగింది? ఉత్తమన్ ప్రదీప్ ఉత్తముడిగా నిలిచాడా? .. నిఖిత చేయని తప్పుకు ఎలా ఇబ్బంది పడింది?.. ఆ తరువాత నమ్మకం అనే పాయింట్ ఇద్దరిని ఎలా ఒక్కటి చేసిందన్నదే అసలు కథ. ఇందులో హీరో సోదరి పెళ్లి తంతు కూడా ఉప కథగా నడవడం తెలిసిందే.
ఈ సినిమా స్ఫూర్తితో ఓ తమిళ ఓ యువకుడు చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. ఫోన్ లు ఎక్స్ ఛేంజ్ చేసుకోవడంతో సదరు యువకుడి బండారం అంతా బయటపడి చివరికి పోలీస్ లు అరెస్ట్ చేసే వరకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన అరవింద్ (23) అనే యువకుడికి పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని 'లవ్ టుడే' సినిమాని స్ఫూర్తిగా తీసుకున్నారు.
ఒకరి ఫోన్ లు ఒకరు మార్చుకున్నారు. అయితే అరవింద్ ఫోన్ బ్రౌజ్ చేస్తుండగా సదరు యువతికి మైండ్ బ్లాంక్ అయింది. అరవింద్ ఫోన్ లో ఓ బాలిక కు సంబంధించిన న్యూడ్ ఫొటోలు కనిపించడంతో అతనితో పెళ్లిని రద్దు చేసుకుంది. అంతే కాకుండా బంధువుల సహాయంతో బాధిత బాలిక తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చేరవేసిందట. ఇంకే ముంది పోలీసులు రంగ ప్రవేశం చేయడం అరవింద్ ని అరెస్ట్ చేయడం చక చకా జరిగిపోయాయట,
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.