జిరాక్స్ మెషీన్లో ఒరిజినల్ పెట్టేసి నంబర్ కొట్టేస్తే సరి.. ఎన్ని కావాలంటే అన్ని కాపీలు వచ్చేస్తాయి. ఇందులో వింత ఏమీలేదు. కానీ.. ఓ వ్యక్తి ఇలాంటి పనిచేస్తే..? తప్పకుండా విశేషమే కదూ! అలాంటి వ్యక్తి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కేవలం పిల్లలు కనడానికే పుట్టాడా ఏమిటి? అని ముక్కున వేలేసుకునేలా ఏకంగా 150 మంది పిల్లల్ని కనేశాడు ఆ గండర గండడు!
ఈ విషయాన్ని బ్రిటీష్ కొలంబియాకు చెందిన మెర్లిన్ బ్లాక్‌మోర్ అనే మహిళ వెల్లడించింది. తమది చాలా పెద్ద కుటుంబం అని చెప్పిన బ్లాక్ మోర్.. అందులో 160 మంది సభ్యుల వరకూ ఉంటారని తెలిపింది. వాయమ్మో.. ఎంతపెద్ద ఉమ్మడి కుటుంబమో..? అని గుడ్లు తేలేస్తున్నారేమో.. ఆగండి ఆగండి. అది ఉమ్మడి కుటుంబం కాదు. ఒకే ఒక కుటుంబం!
మెర్లిన్‌కు 149 మంది తోబుట్టువులు ఉన్నారట. వీరందరికీ తల్లులు వేరైనా.. తండ్రి మాత్రం ఒక్కడే. అతడే.. మెర్లిన్ తండ్రి విన్‌స్టన్ బ్లాక్‌మోర్. ఆయనకు 27 మంది భార్యలు ఉన్నారు. వీరిలో (22 మందికి మాత్రమే పిల్లలు జన్మించారు. వీరిద్వారా ఆయనకు కలిగిన సంతానమే ఈ 150 మంది!
తన కుటుంబం గురించిన రహస్యాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేశాడు మెర్లిన్. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఈ 19ఏళ్ల టీనేజర్ కు.. గత మూడేళ్లుగా తండ్రితో మాటల్లేవట. అయితే.. తోడబుట్టినవారితో మాత్రం టచ్‌లోనే ఉన్నాడట. కుదిరినప్పుడల్లా అంతా ఒక్కచోట చేరి సంబరాలు చేసుకుంటారట.
మరి, ఇంత మందిని పెళ్లి చేసుకుంటే రాజ్యాంగం ఒప్పుకుందా.. అంటే చట్టం ఒప్పుకోలేదట. అయితే.. స్థానిక చట్టాల ప్రకారం దానికి చిన్న శిక్షే విధించారు. ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నందుకు 64 సంవత్సరాల విన్‌స్టన్ పై కేసు నమోదైంది. దీని ప్రకారం.. ఆరునెలల పాటు ఆయనకు గృహ నిర్బంధం విధించారు. ఏదిఏమైనా.. 150 మందికి జన్మనిచ్చిన ఈ ఉద్దండ పిండానికి ఎలాంటి బిరుదు ఇద్దామంటారు..?