సచిన్ రికార్డులను ఇతడే బద్దలు కొట్టగలడు

Update: 2021-01-26 17:30 GMT
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ జో రూట్  వరుస సెంచరీలతో హోరెత్తించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏకంగా 2-0తో ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ లో ఆల్ టైమ్ దిగ్గజ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించే సత్తా జోరూట్ కు ఉందని.. అతడికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మాజీ దిగ్గజ క్రికెటర్ జెఫ్రీ బాయ్ కాట్ కొనియాడారు.

శ్రీలంకతో సిరీస్ లో ఏకంగా జోరూట్ 106.50 సగటుతో 426 పరుగులు చేశాడు. 30 ఏళ్ల జోరూట్ ఇప్పటికే 99 టెస్టులు ఆడాడు. ఈ ఫార్మాట్ లో ఇంగ్లండ్ తరుఫున అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో రూట్ పై బాయ్ కాట్ ప్రశంసలు కురిపించాడు.

200 టెస్టులు ఆడగల సత్తా రూట్ కు ఉందని.. క్రికెట్ దిగ్గజం సచిన్ కన్నా ఎక్కువ పరుగులు చేయగలడని.. ఇప్పటికే టెస్టుల్లో 8249 పరుగులు చేశాడని..  టెండూల్కర్ చేసిన 15921 పరుగులను ఇతడు అధిగమించగలడని బాయ్ కాట్ అభిప్రాయపడ్డాడు.

విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, కేన్ విలయమ్సన్  లతో రూట్ ను పోల్చాలని.. కొత్త తరంతో కూడా ఇతడు పోటీపడగలడని తెలిపాడు. ఇప్పటిదాకా సరిగా ఆడని రూట్ కరోనా లాక్ డౌన్ తర్వాత శ్రీలంకలో అద్భుతంగా ఆడాడని కొనియాడారు. ఆస్ట్రేలియా పేస్ ను ఎదుర్కొన్నప్పుడే రూట్ కు అసలైన సవాల్ అని బాయ్ కాట్ విశ్లేషించాడు.
Tags:    

Similar News