రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే.. కొత్త డిమాండ్

Update: 2022-11-07 07:04 GMT
మునుగోడులో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఎన్నికల ముందు తొడగొట్టాడు రాజగోపాల్ రెడ్డి. ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ సవాల్ చేశారు. ఆ యాంకర్ కూడా పదే పదే కోరింది.. 'సన్యాసం అంటున్నారు.. మరి ఓడిపోతే ఈ వీడియోను పదే పదే టీవీల్లో వేస్తాం' అని.. దానికి ఓకే అన్న రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ ను ఓడగొట్టి తీరుతానంటూ శపథం చేశారు. కానీ కట్ చేస్తే మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. దీంతో అడ్డంగా బుక్కయ్యాడు.

రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు ఏదైనా రాజకీయ స్టేట్ మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నోరుజారితే బుక్కైపోతారు. తొందరపడి మాట తూలితే అంతే సంగతులు. మీడియా వాళ్లు, సోషల్ మీడియాలో జనాలు ఆడేసుకుంటారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి కూడా తాను చేసిన సవాళ్లు, కామెంట్లకు ఇప్పుడు బలి అవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి పోటీచేసిన రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి చేతిలో 11వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

అయితే ప్రచార సమయంలో ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఆ ఊపులో పెద్దపెద్ద సవాళ్లు చేసి భారీ స్టేట్ మెంట్ లు ఇచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ గెలిపించుకుంటే.. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేసుకుంటానని సంచలన సవాల్ చేశారు.

యాంకర్ దీనిపై 'ఆలోచించి స్టేట్ మెంట్ ఇవ్వండి.. లేదంటే ఎన్నికల్లో ఓడిపోతే దీన్నే వైరల్ చేస్తాం' అంటూ అప్పటికీ హెచ్చరించింది. అయినా కూడా తగ్గేదేలే అంటూ రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు.

ఇప్పుడు ఓడిపోవడంతో రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకులు, సోషల్ మీడియా నెటిజన్లు అంతా రాజగోపాల్ రెడ్డి మీద పడిపోయారు. రాజీనామా చేస్తావా? చస్తావా? అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఎప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యంగ్యాస్త్రాలతో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News