ఎప్పుడు ఎవరికి టైమ్ ఎలా కలిసి వస్తుందో చెప్పలేం. కొన్నేళ్ల కిందట ఆయన ఒక చోటా నేత. గత ఐదేళ్లలో ఆయన కెరీర్ లో బ్రహ్మాండమైన గ్రోత్ కనిపించింది. ఇప్పుడు మరింత మెరుగైన స్థాయికి వెళ్తున్నారు. ఆయనే పీయూష్ గోయల్. పెద్దగా ప్రజా నేత కాదు కానీ మోడీ సర్కారులో మాత్రం ఈయనకు మంచి ప్రాధాన్యత దక్కుతూ వస్తోంది. మోడీ మొదటి కేబినెట్లో కూడా మంత్రి పదవిని పొందిన గోయల్, రెండో సారి కూడా ఆ పదవిని పొందారు. రైల్వే శాఖా మంత్రిగా నియమితం అయ్యారు.
అలా యూనియన్ మినిస్టర్ గానే కాకుండా, ఇప్పుడు గోయల్ కు మరింత ప్రాధాన్యత దక్కుతూ ఉంది. ఈయనను రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి ఉప నేతగా ఎన్నుకున్నారు. రాజ్యసభలో బీజేపీ తరఫున నంబర్ -2 గా ఈయన వ్యవహరించబోతూ ఉన్నారు.
రాజ్యసభలో ఉన్నారంటేనే ఈయనకు ప్రజల నుంచి ఎన్నికయ్యే ఛరిష్మా లేదని స్పష్టం అవుతున్నట్టే. అయినా గోయల్ కు తిరుగు లేదని స్పష్టం అవుతోంది. మోడీ రెండో కేబినెట్లో కూడా చోటు దక్కించుకుని, ఇప్పుడు రాజ్యసభలో డిప్యూటీ లీడర్ అయ్యారీయన. ఇంకా రానున్న కాలంలో ఇంకా ఏ స్థాయికి ఎదుగుతారో!