ఆ ఘనత సాధించిన రెండో భారత బ్యాట్స్ మెన్..హిట్ మ్యానే

Update: 2021-03-19 07:45 GMT
టీమిండియా స్టార్​ ఓపెనర్​ రోహిత్​ శర్మ మరో రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్​లో 9 వేల పరుగులు సాధించిన రెండో భారతీయ క్రికెటర్​గా ఘనత సాధించాడు. ఇప్పటికే ఈ రికార్డును టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ సాధించగా.. అదే సరసన రోహిత్​ కూడా చేరాడు. నిన్న అహ్మదాబాద్​లోని మొతేరా స్టేడియంలో టీమిండియా.. ఇంగ్లండ్​ మధ్య నాలుగో టీ20 జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ ఈ రికార్డును కైవసం చేసుకోవడం గమనార్హం.

 ఇంగ్లాండ్​ బౌలర్​ ఆదిల్​ రషీద్​ వేసిన తొలి ఓవర్​ లోని తొలి బంతినే రోహిత్​ సిక్సర్​ గా మలిచాడు. తొమ్మిది వేల పరుగులు మార్క్ సాధించాడు. ఇప్పటికే టీం ఇండియా తరఫున కెప్టెన్​ విరాట్​ కోహ్లీ (9,650) పరుగులు సాధించగా.. తాజాగా రోమిత్​ శర్మ సాధించిన 12 పరుగులతో అతడి మొత్తం స్కోర్ ​(9006) పరుగులు అయ్యింది.వీరి తర్వాత స్థానంలో సురేశ్ రైనా ఉన్నాడు.  రైనా (8494) పరుగులు సాధించాడు.

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన నాలుగో టీ20లో టీ మిండియా విజయం సాధించింది. సూర్యకుమార్​ చెలరేగి ఆడాది 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు కొట్టి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో బ్యాట్స్​ మెన్​ రిషభ్​ పంత్​ 23 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు కొట్టాడు. ఇక శ్రేయస్​ అయ్యర్​ కూడా కేవలం 18 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. దీంతో టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు సాధించింది.  

లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఇంగ్లండ్‌ జట్టును ఎప్పట్లాగే జేసన్‌ రాయ్‌ ధాటిగా నడిపించాడు. కానీ బట్లర్‌ (9), మలాన్‌ (14) నిష్క్రమణతో ఇన్నింగ్స్‌ తడబడింది. ఈ దశలో బెయిర్‌ స్టో (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌), స్టోక్స్‌ నాలుగో వికెట్‌కు 65 పరుగులు సాధించారు. అయితే 17వ ఓవర్లో వరుస బంతుల్లో స్టోక్స్, మోర్గాన్‌ (4)లు ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సివుండగా శార్దుల్‌ 14 పరుగులు ఇవ్వడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. ఎనిమిది పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది.
Tags:    

Similar News