నేరస్తుడు ఎంత తెలివైనోడైనా.. పోలీసులు అంతకు మించిన తెలివి ఉంటుందన్నది మర్చిపోకూడదు. నేరం చేసి తప్పించుకోవటం ఏ మాత్రం సులువు కాదు. కాస్త ఫోకస్ పెడితే ఎలాంటి నేరాన్ని అయినా సాల్వ్ చేసే సత్తా మన పోలీసుల సొంతం. ఇందుకు తాజా ఉదంతమే పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. సినిమాల్లో ఏమైనా జరగొచ్చు. నేరం చేసి తప్పించుకోవచ్చు. కానీ.. రియల్ లైఫ్ లో అలా సాధ్యం కాదు.
విన్నంతనే ఆ మధ్యన విడుదలై సంచలన విజయాన్ని సాధించిన దృశ్యం సినిమా గుర్తుకొచ్చే ఈ ఉదంతం కేరళలో జరిగింది. సినిమాలో మాదిరే బోలెడన్ని ట్విస్టులు ఉన్నా.. నేరం చేసిన నేరస్తుడు మాత్రం రియల్ లైఫ్ లో పోలీసులకు దొరికిపోయాడు. చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇంతకూ జరిగిందేమంటే?
కేరళకు చెందిన ప్రేమకుమార్.. విద్యలు భార్యభర్తలు. కొన్నేళ్లు వీరి కాపురం బాగానే సాగినా తర్వాత గొడవలు మొదలయ్యాయి. కొన్ని రోజుల క్రితం స్కూల్ రీయూనియన్ లో పాత స్నేహితుల్ని కలిశారు. ఆ సమయంలో అతనికి సునీత అనే మహిళ పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో.. తమకు అడ్డుగా తన భార్య విద్యను చంపాలని నిర్ణయించుకున్నాడు ప్రేమ్ కుమార్. దీనికి సునీత కూడా సహకరించేందుకు ఒప్పుకుంది.
ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సెప్టెంబరు 22న తిరువనంతపురంలోని విల్లాలో భార్య విద్యతో కలిసి ఉన్నాడు ప్రేమ్ కుమార్. అక్కడకు చేరుకున్న సునీతతో కలిసి.. భార్య గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఆమె డెడ్ బాడీని తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతానికి తీసుకెళ్లి.. గొయ్యి తీసి పూడ్చి పెట్టారు. దృశ్యం సినిమాలో మాదిరే ఆమె ఫోన్ ను బిహార్ కు వెళ్లే రైల్లోకి విసిరేశాడు. ఏమీ ఎరగనట్లుగా తిరిగి వచ్చి తన భార్య కనిపించటం లేదంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.
ఇది జరిగిన రెండు నెలలకు తిరునల్వేలిలో సునీతతో కలిసి కాపురం పెట్టాడు. ఇదిలా ఉంటే కంప్లైంట్ అందుకున్న పోలీసులు విద్య సెల్ ఫోన్ నుంచి దర్యాప్తు షురూ చేశారు. ఆమె ఫోన్ బిహార్లో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు తిరునల్వేలిలో ఒక గుర్తు తెలియని మహిళ డెడ్ బాడీని గుర్తించారన్న సమాచారాన్ని అందుకున్న కేరళ పోలీసులు.. ఆ సమాచారాన్ని తెప్పించుకున్నారు. అది విద్యదే అన్న విషయాన్ని గుర్తించారు.
దీంతో దర్యాప్తు మీద మరింత ఫోకస్ పెట్టగా.. భార్యభర్తలు ఇద్దరు గొడవలు పడేవారన్న విషయం విచారణలో బయటపడింది. ప్రేమ్ కుమార్ తీరు మీద అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ షురూ చేశారు. దీంతో తన భార్యను హత్య చేసిన విషయాన్ని అతగాడు అంగీకరించాడు. సినిమాల్లో నేరస్తుడు తప్పించుకోవచ్చు. కానీ.. రియల్ లైఫ్ లో మాత్రం అదంత తేలికైన విషయం ఎంతమాత్రం కాదు.