కొత్తొక వింత..పాతొక రోత..అన్న సామెతను ఊరికే చెప్ప లేదు. పాత విషయాలను మరిచిపోయి కొత్తగా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కొత్తదనం కోసం కొందరు శారీరకంగా.. మానసికంగా కష్టపడడమే కాకుండా డబ్బును కూడా భారీగానే ఖర్చుపెట్టుకుంటున్నారు. జపాన్ కు చెందిన ఓ వ్యక్తికి మనిషి రూపంలో ఉండడం ఇష్టం లేదట. అతనికి మనుషుల కంటే జంతువులపైనే ప్రేమ ఎక్కువ ఉందట. వాటిల్లోనూ 'కోలీ' జాతికి చెందిన కుక్కలంటే ప్రాణమట.
అయితే ఆ కుక్కలా మారిపోవాలని ఎప్పటినుంచో కోరిక ఉందట. ఈ క్రమంలో కుక్కలా మారిపోవడానికి ఓ మార్గం దొరికింది. ఇంకేముంది.. 'కోలి' శునకంలా మారడానికి అతడు రూ.12 లక్షలు ఖర్చు చేసుకున్నాడు. అతని కోరిక తీర్చుకున్నాడు.. పూర్తి వివరాల ఇక్కడ చదవండి..
'కోలి' జాతికి చెందిన ఓ శునకం ఫొటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. అయితే అందరు అనుకుంటున్నట్లు అది కుక్క కాదు. ఓ మనిషి. అచ్చం శునకంగా మారిపోయిన ఓ మనిషి.. జపాన్ లోని టోకో ఈవీ అనే వ్యక్తి ఇలా మారిపోయాడు. టోకో ఈవీ ఇలా మారేందుకు జెప్పెట్ అనే సంస్థను ఆశ్రయించాడు.
అద్భుత కళాఖండలు, ప్రసిద్ధ మస్కట్ లను తయారు చేయడంలో జెప్పెట్ ప్రసిద్ధ గాంచింది. ఈ నేపథ్యంలో టోకో ఈవీ జెప్పెట్ కళాకారుల వద్దకు వెళ్లి.. తనను కుక్కలాగా మార్చివేయాలని కోరాడు. అందుకు ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదని చెప్పాడు. దీంతో జెప్పెట్ కళాకారులు అందుకు అంగీకరించారు.
దాదాపు 40 రోజుల పాటు కష్టపడి టోకో ఈవీని కోలి జాతి కుక్కలాగా మార్చేశారు. బ్రౌన్ కలర్ లో అచ్చం శునకానికి ఉండే వెంట్రుకల్లగా టోకో ఈవీని కుక్కలాగా మార్చేశారు. అయితే ఇలా మార్చినందుకు అతడి వద్ద నుంచి రూ.12 లక్షలు తీసుకున్నారు. ఆ తరువాత టోకో ఈవీ తాను కుక్కలాగా మారిపోయిన ఫొటోలను సోషల్ మీడియాకు షేర్ చేశాడు. ఈ సందర్భంగా తన ఫొటోలతో పాటు కొన్ని విషయాలను చెప్పాడు.
'నాకు జంతువులంటే ఇష్టం.. దీంతో నేనే కుక్కలాగా మారిపోతే రియలిస్టిక్ గా ఉంటుందని భావించాను. శునకాలల్లో కోలి జాతి కి చెందినవంటే ప్రాణం. అందుకే ఆ జంతువులా మారిపోవాలని కోరిక ఉండేది. ఇప్పడు ఆ కోరికను తీర్చుకున్నాను. ఇలా ఉండడం ఎంతో బాగుంది..' అని టోకో ఈవీ ట్విటర్లో మెసేజ్ పెట్టాడు. అయితే ఏమాత్రం తేడా లేకుండా ఈవీని శునకంలా మార్చిన జెప్పెట్ పనితీరును చాలా మంది ప్రశంసిస్తున్నారు.