91 మంది విద్యార్థులపై అత్యాచారం...55 ఏళ్ల జైలు శిక్ష

Update: 2017-09-20 11:40 GMT
ప్ర‌స్తుత కాలంలో ఇంటా బ‌య‌ట‌ విద్యార్థిని, విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌రువ‌యింద‌నే అభిప్రాయాలు బ‌లంగా వినిపిస్తున్న నేప‌థ్యంలో అలాంటి భ‌యాందోళ‌న‌లు నిజ‌మ‌నిపించేలా...ఇంకా చెప్పాలంటే వికృత పోక‌డ‌ల‌కు నిల‌యంగా మారిన ప‌రిస్థితుల‌కు అద్దం ప‌ట్టే ఘ‌టన ఇది. మ‌దురై స‌మీపంలోని ఓ ప్రభుత్వ పాఠ‌శాల‌లోని ప్ర‌ధానోపాధ్యాయునికి యాభై ఐదేళ్ల జైలు శిక్ష వేశారు. ఆయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురికి సైతం అదే శిక్ష ప‌డింది. ఎందుకంటే విద్యార్థి, విద్యార్థినులపై అత్యాచారాలకు పాల్పడినందుకు. అదికూడా ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా 91 మందిపై బ‌లాత్కారానికి పాల్ప‌డ్డారు. దీనిపై 22 కేసులు న‌మోద‌య్యాయి.

మ‌దురై స‌మీపంలోని పొదుంపబు గ్రామంలో ఎస్‌ అరోకిసమి అనే ప్ర‌ధానోపాధ్యాయుడితో పాటు మ‌రో ముగ్గురు టీచ‌ర్లు క‌లిసి విద్యార్థిని, విద్యార్థుల‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఇలా వీరి ఆకృత్యాల‌కు గురైన బాధితుల్లోకి ఒక‌రి త‌ల్లి కేసు వేసేందుకు ముందుకు వ‌చ్చింది. పాఠ‌శాల‌లో చ‌దువుతున్న పిల్ల‌ల‌పై ఈ స్థాయిలో ఆకృత్యాల‌పై పాల్ప‌డిన ఘ‌ట‌న మద్రాసు హైకోర్టు మెట్లెక్కింది. అయితే బాధిత విద్యార్థిని, విద్యార్థుల్లో ఎస్సీ, ఎస్టీ వారు ఉండటంతో ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. ఈ సంద‌ర్భంగా 12,32,500 జ‌రిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇలా బాధితులకు ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరడం దేశంలోనే మొదటి సారి కావడం గమనార్హం.

అరోకిసమితో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయుల‌పై బాధితుల్లో ఒకరి తల్లి కేసు వేసింది. ఈ తీర్పును విచారణ చేసిన న్యాయమూర్తి ఈ సంచ‌ల‌న తీర్పు ఇచ్చారు. సి.అమాలీ రోస్‌, షణ్ముగ కుమారస్వామి, విక్టర్‌ను సైతం దోషులుగా నిర్దారించింది. అయితే కేసు వేసిన విద్యార్థి త‌ల్లి దుర్మరణం పాలవడం గమనార్హం. కాగా, ప్రాసిక్యూటర్‌ పురుష అభ్యర్థి కావడంతో విచార‌ణ విష‌యంలో ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు  పి.ప్రమీళాదేవిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నియమించారు. ఆమె సార‌త్ంయ‌లోనే వాద‌న‌లు జ‌రిగాయి.
Tags:    

Similar News