శృంగారంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?

Update: 2020-04-26 17:30 GMT
కరోనా మహమ్మరి ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్ నుంచి బయటపడాలంటే ప్రతీఒక్కరు రోగనిరోధక శక్తి పెంచుకొని తీరాల్సిందే. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో భార్యభర్తలు ఇంట్లో ఉంటే శృంగారంలో పాల్గొంటూ ఎంజాయ్ చేయచ్చు. ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్న లేదా మీరు భాగస్వామితో దూరంగా క్వారంటైన్లో ఉన్నట్లయితే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు హస్తప్రయోగం చేసుకొని ఆనందాన్ని పొందొచ్చు. శృంగారంలో రకరకాల పద్ధతులను అవలంభించడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

*శృంగారమే మందు..

కరోనా సమయంలో శృంగారం ఒకటే సమర్థవంతంగా వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందని సెక్సాలిస్టులు అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు అధ్యయనం చేస్తున్నారు. శృంగార పురుషుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని సెక్సాలిజిస్టులు అంటున్నారు. శృంగారం మనస్సుకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. శృంగారం తర్వాత మైండ్ రిలాక్స్ అవుతుంది. సెక్స్ హార్మోన్లలో ఎండార్ఫిన్స్, ఇతర మంచి హార్మోన్లు విడుదలై ఒత్తిడిని దూరం చేస్తాయని ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఎండార్ఫిన్ హార్మోన్లు ఉత్పత్తి కావడంతో న్యూరో కెమికల్స్ ఉత్తేజం చెంది శరీరంలో పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందట. కౌగిలింతలు, పోర్ ప్లే వల్ల లవ్ హార్మోన్ ఉత్పత్తి అవటం వల్ల మానసికంగా ధృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

*వారంలో కనీసం రెండుసార్లు శృంగారం..

వారంలో శృంగారం ఎన్నిసార్లు చేస్తే మంచిది అనేదానిపై పెన్సిల్వేనియాలోని విల్కీస్ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగేందుకు వారంలో ఒకసారి లేదా రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే మంచిదనే అభిప్రాయం వెల్లడైంది. ఇలాంటి వారిలో ఇమ్యునోగ్లోబులిన్ స్థాయిలు అత్యధిక స్థాయిలో పెరిగినట్టు రీసెర్చర్లు గుర్తించారు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు సెక్స్ చేసిన వ్యక్తులు అత్యధిక స్థాయిలో ఇగో కలిగి ఉంటారని తేలింది. శృంగారంలోకౌగిలింతలు, ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని  కిన్సే ఇన్ స్టిట్యూట్ అధ్యయనంలో గుర్తించారు. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది.

*సింగిల్ గా ఉన్నవారికి హస్తప్రయోగంతో ఆరోగ్యం..

సింగిల్ ఉన్నవారు లేదా భాగస్వామికి దూరంగా ఉన్నవారికి హస్తప్రయోగంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సెక్సాలజిస్టులు పేర్కొంటున్నారు. సింగిల్ ఉన్నవారు హస్తప్రయోగం ద్వారా శృంగార కోరికలను మరింత సమయం కేటాయించవచ్చు. సెక్సువల్ కంటెంట్ - న్యూడ్ వంటి వాటిని ఊహించుకోవడం ద్వారా సెక్స్ కోరికలను పెంచుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్ తో భాగస్వామితో శృంగారం చేయలేక ఒత్తిడి చెందతున్నవారికి హస్త ప్రయోగం ఒక్కటే సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. కాగా లాక్డౌన్ వల్ల కావాల్సిన సమయం దొరకడంతో దంపతులు తమ శృంగారాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.


Tags:    

Similar News