బీజేపీ ప్రవేశ పెట్టిన పథకాల్ని ఆ పార్టీ నేతలే నీరుగారుస్తున్నారు. పింక్ సిటీగా పేరున్న రాజస్థాన్ జైపూర్ గోడలపై ఆ నియోజకవర్గ మంత్రి మూత్రం పోయడం వివాదాస్పదమైంది. రాజస్థాన్ లో రాష్ట్ర బీజేపీకి చెందిన ఆరోగ్యశాఖా మంత్రి కాళీ చరణ్ షరాఫ్ రోడ్డు మీద బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఓ వైపు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ - స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే మంత్రి ఇలా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కాళీ చరణ్ కొట్టిపారేశారు. ఇదేమీ పెద్ద విషయం కాదని అన్నారు. పింక్ సిటీ రూల్స్ ప్రకారం ఎవరైనా రోడ్డు మీద మూత్రం పోస్తే వారికి రూ.200 జరిమానా విధిస్తారు. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఒకవైపు స్వచ్ఛభారత్ కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే, ఇలాంటి మంత్రలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తన స్వంత నియోజకవర్గంలోనే ఇలా చేయడం దారుణమని కాంగ్రెస్ నేతలన్నారు. దోల్‌పూర్ ఉప ఎన్నికల సమయంలోనూ మంత్రి షరఫ్ ఇలాగే బహిరంగంగా మూత్ర విసర్జన చేశారన్నారు