కరోనా నుండి కోలుకున్న వారిలో గుండె పనితీరు.. షాకింగ్‌ విషయాలు

Update: 2021-06-28 09:30 GMT
కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా పూర్తిగా ఆరోగ్యవంతులు అయినట్లుగా పరిగణించవద్దంటూ నిపుణులు పదే పదే చెబుతున్నారు. దానికి కారణం కరోనా నుండి కోలుకున్న వారికి అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు ఏకంగా అనారోగ్యంతో మృతి చెందుతున్నారు. కరోనా బారిన పడ్డ ఎంతో మంది కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా నెగటివ్ వచ్చిన తర్వాత కూడా అందుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే పలు ప్రయోగాల్లో వెళ్లడి అయ్యింది.

ఇటీవలే ఒక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ వెలువరించిన సర్వే రిపోర్ట్ లో కరోనా బారిన పడ్డ వారు కనీసం ఏడాది పాటు ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమయంలో మృతి చెందుతున్న వారు కూడా ఉన్నారు. ఇక కరోనా నుండి కోలుకున్న వారిలో గుండె పని తీరు ఎలా ఉంది.. వారికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏంటీ అనే విషయమై నిపుణులు అధ్యయనం చేయగా షాకింగ్‌ విషయాలు వెళ్లడి అయ్యాయి.

కరోనా నుండి కోలుకున్న వారిలో కొందరిని పరిశీలిస్తే వారి గుండె లయ తప్పి కొట్టుకుంటున్నట్లుగా గుర్తించారు. అలాగే అంతకు ముందు వరకు లేని గుండె సమస్యలు కరోనా నుండి కోలుకున్న తర్వాత వస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ లో వైరస్ బారిన పడ్డ వారిలో  గుండె సమస్యలు అధికంగా ఉంటున్నాయని నిర్థారించారు. కొత్త వేరియంట్‌ వల్లే కోలుకున్న తర్వాత గుండెకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని.. అందుకు సంబంధించిన లక్షణాలు ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. గుండెలో రక్త ప్రసరణతో పాటు అనేక విధులకు కరోనా ఆటంకం కలిగిస్తుందట.

గుండె సమస్యలతో పాటు ఊపిరితిత్తులు మరియు రక్త నాళాల్లో కూడా కరోనా కారణంగా వ్యర్థాలు అధికంగా నిలువ ఉంటున్నాయని అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. శరీరం మొత్తం విస్తరించకుండా అక్కడక్కడ గడ్డలు కట్టడం వల్ల కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా కారణంగానే ఈ సమస్యలు వస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని సార్లు కరోనా నుండి బయట పడ్డ తర్వాత కూడా గత ఏడాది కరోనా బారిన పడ్డ వారితో పోల్చితే ఈ ఏడాదిలో కరోనా బారిన పడ్డ వారిలో అత్యధికులు గుండె సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ముందు ముందు కరోనా మరింత ప్రమాదకరంగా మారినా ఆశ్చర్యం లేదు.
Tags:    

Similar News