భారీ వర్షాలు.. ఆపై విరుచుకుపడిన వరదతో చెన్నై నగరాన్ని నీరు కమ్మేసి ఐదు రోజులైన నేపథ్యంలో తాజాగా చెన్నైలో పరిస్థితి ఎలా ఉన్నారు.? ఏం చేస్తున్నారు? వాతావరణం ఎలా ఉంది? సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? సగటు జీవి సంగతేంటి? సహాయక చర్యలకు ఇంకా ఎన్నాళ్లు సాగాల్సి ఉంటుంది? చెన్నై పరిస్థితి నార్మల్ కావటానికి మరెంత టైం పడుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
= ప్రస్తుతం చెన్నై మహానగరంలోని లక్షలాది మంది ప్రజల నోటి నుంచి వచ్చేవి రెండే. ఒకటి ఆకలి.. రెండోది దాహం. కడుపు నిండా తినటానికి కాసింత ఆహారం.. గొంతు తడుపుకోవటానికి గుక్కెడు నీళ్లు. ఈ రెండు లేక వారు పడుతున్న ఇబ్బంది అంతాఇంతా కాదు. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. దాతలు భారీగా సహాయక చర్యలు చేపడుతున్నా.. అవసరానికి తగినంత ఆహారాన్ని.. మంచి నీటిని అందించలేకపోతున్నారు. ఎందుకంటే.. సాయం కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉండటమే దీనికి కారణం. సాయం భారీగా వస్తున్నా.. భారీగా ప్రజలు సాయం కోరటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
= జన జీవితం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. రైళ్లు నడుస్తున్నాయి. రోడ్ల మీదకు వాహనాలు వస్తున్నాయి. ఫోన్లు ఇప్పుడిప్పుడే పని చేస్తున్నాయి. విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్రు. మొత్తంగా చెన్నై కోలుకొంటోంది. కానీ.. ఎప్పటిలా మారాలంటే కొన్ని వారాలు పట్టటం ఖాయం. ఇప్పుడున్న ఇబ్బందుల్ని అధిగమించటానికి కనీసం మరో వారం అవసరం కానుంది.
= మూతపడిన ఏటీఎంలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. వరద ఇంకా తగ్గని ప్రాంతాలకు బోట్లలో ఏటీఎం మిషన్లను తీసుకెళ్లి సేవలు అందిస్తున్నారు. పెట్రోల్ బంకుల దగ్గర దారుణమైన క్యూలు ఉంటున్నాయి.
= ధరల వాతలు చెన్నై ప్రజలకు తప్పటం లేదు. నిత్యవసర వస్తువులు... నీళ్లు.. పాలు.. కూరగాయలు.. పండ్లు.. ఇలా ప్రతి వస్తువ ధర మండిపోతోంది. మధ్యతరగతి వారు సైతం బెంబేలెత్తిపోయేలా పరిస్థితులు ఉన్నాయి. ఇక.. పేద ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.
= చెన్నై మహానగరంతో పాటు.. వరద కారణంగా దెబ్బ తిన్నతమిళనాడులోని మిగిలిన జిల్లాల్లోనూ పరిస్థితులు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. కాకపోతే.. అందరి ఫోకస్ చెన్నై మీద ఉండటంతో.. పలు జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురి అవుతున్నారు. వారికి సాయం అంతంతమాత్రంగా అందుతోంది.
= శనివారం సాయంత్రం నుంచి దక్షిణ మధ్య రైల్వే.. ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. బస్సు రవాణా కూడా మొదలైంది. ప్రజా రవాణా 80 శాతం వరకూ పునరుద్ధరణ జరిగిందన్న మాటను ప్రభుత్వం చెబుతున్నా.. అంతకంటే తక్కువగానే ఉందన్న పరిస్థితి నెలకొని ఉంది.
= వర్షాలు.. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 500 దాటింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50వేలు పరిహారాన్ని ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు.