బ్రేకింగ్: నల్గొండ జిల్లాలో కూలిన హెలిక్యాప్టర్

Update: 2022-02-26 06:59 GMT
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో ట్రైనింగ్ హెలిక్యాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. జిల్లాలోని పెద్దపూర మండలం, తుంగతుర్తి సమీపంలో రామన్నగూడెం తండా వద్ద ఇది చోటుచేసుకుంది. శిక్షణనిచ్చే ట్రైనీ హెలిక్యాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి. శిక్షణకు ఉపయోగించే ఈ హెలిక్యాప్టర్ ఒక్కసారిగా కిందపడడంతో తునాతునకలైంది.

ప్రమాద సమయంలో మహిళా పైలెట్ తో సహా ట్రైనింగ్ పైలెట్ ఉన్నట్లు సమాచారం. వెంటనే పోలీసులు, రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. విద్యుత్ స్తంభంపై హెలిక్యాప్టర్ కూలడంతో భారీగా మంటలు వ్యాపించాయని స్థానికులు పేర్కొన్నారు.

ఇది ఎక్కడి నుంచి టేకాఫ్ అయ్యింది? ఎందుకు నల్గొండకు వెళ్లిందనే దానిపై ఆరాతీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ కేంద్రంగానే శిక్షణ విమానాలు, హెలిక్యాప్టర్లు నడుస్తాయి. మరి ఈ హెలిక్యాప్టర్ ఎందుకు నల్గొండ వరకూ వెళ్లిందన్నది అంతుచిక్కడం లేదు. రాడార్ తో దీనికి సంబంధాలు తెగిపోయాయా? అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. శిక్షణ విమానం అని కూడా దీన్ని కొందరు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News