బెజవాడ బాబు ఇంటికి హెలిప్యాడ్

Update: 2015-10-13 07:49 GMT
హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమే కాస్త వేరుగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ బాబుగా పేరున్న ఆయన.. తాజాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కాస్లీ బాబుగా మారారు. వివిధ కార్యక్రమాల కోసం ఆయన పెడుతున్న ఖర్చు ఇప్పుడు అందరి నోట నానుతోంది. విదేశీ పర్యటనల సందర్భంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించటం.. భారీతనంతో పనులు చేయించటం.. ఆఫీసు.. ఇంటి లాంటి వాటి కోసం కోట్లు ఖర్చు పెట్టటం లాంటి  విషయాలు ఇప్పటికి తెలిసినవే.

ప్రస్తుతం ఆయన ఉండవల్లి సమీపాన కృష్ణా నది కరకట్టపై తాత్కలిక నివాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే. లింగమనేని ఎస్టేట్ గెస్ట్ హౌస్ లోఉంటున్న చంద్రబాబు నివాసం తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇంటి వద్దే హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నారు. నివాసం నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు కార్లో వెళ్లటం కారణంగా ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు ఎక్కువైన విషయం గుర్తించారట.

దీంతో.. జనాలకు కష్టం లేకుండా చేసేందుకు ఇంటి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కి హెలికాఫ్టర్ లో వెళ్లేందుకు వీలుగా ఇంటి దగ్గరే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటనల సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ కి కారులో వెళ్లటం కష్టం కావటంతో.. ఇంటి దగ్గర నుంచి హెలికాఫ్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకొని అక్కడ నుంచి వెళుతున్నారు. ఇంటి నుంచి ఎయిర్ పోర్ట్ కి హెలికాఫ్టర్ లో వెళ్లే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొత్త ఇమేజ్ ను సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు.
Tags:    

Similar News