సాహసం చేసి ఇద్దరు చిన్నారుల్ని కాపాడిన ఎంపీ

Update: 2015-08-23 07:40 GMT
కొద్ది రోజుల కిందట తన తీరుతో విపరీతమైన విమర్శలు ఎదుర్కొని.. మానసిక వేదన అనుభవించిన ఎంపీ హేమమాలిని ఈసారి అందుకు భిన్నమైన అనుభవం ఎదురుకానుంది. తన తప్పు లేకున్నా.. తనను నిందించిన వైనంపై ఆమె ఎంతగానో బాధ పడి వేదన చెందారు. ఆ మధ్య ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టటం.. ఆ ఘటనలో ఆమె గాయాలుపాలు కావటం తెలిసిందే. అయితే.. అదే యాక్సిడెంట్ లో మరో పాప తీవ్రంగా గాయపడటం.. ఆ విషయాన్ని హేమమాలిని గుర్తించకపోవటం.. ఆ చిన్నారికి వైద్య సాయం అందించటంలో జరిగిన ఆలస్యానికి చనిపోవటం తెలిసిందే.

ఈ ఘటన హేమమాలినిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తేలా చేసింది. బాధ్యత కలిగిన ఎంపీగా వ్యవహరిస్తూ.. ఆ మాత్రం సాయం చేయలేరా? అన్న మాట దగ్గర నుంచి ఎవరికి ఏది అనిపిస్తే.. ఆ మాటలు అనేయటం ఆమె మానసికంగా షాక్ కు గురయ్యారని చెబుతారు.

తాజాగా అదే హేమమాలిని అత్యంత సాహసంతో వ్యవహరించి ఇద్దరు చిన్నారుల్ని రక్షించిందని చెబుతున్నారు. తాజాగా ఆమె.. తన నియోజకవర్గమైన మధురలోని రాల్ గ్రామంలో ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో.. భారీగా వచ్చిన ప్రజల్లోని రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. దీంతో.. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గొడవ పెద్దది కావటం.. జనాల మధ్యలో ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోవటాన్ని గమనించి హేమమాలిని.. స్టేజ్ దిగి.. వారిని జనసందోహం నుంచి తప్పించి.. సురక్షితంగా ఉంచారు. ఆమె కానీ.. సకాలంలో స్పందించకుంటే ఇద్దరు చిన్నారులు తీవ్ర గాయాలు పాలయ్యే వారని చెబుతున్నారు. ఏమైనా తనకు స్పందించే మనసు ఉందని.. తనపై అనవసరంగా నిందలు వేయొద్దన్న విషయం ఆమె తన తాజా చర్యతో చెప్పకనే చెప్పేసినట్లు ఉంది కదూ.
Tags:    

Similar News