14 ఏళ్ల తర్వాత దొరికిన పర్సు... అందులో ఏముందంటే ?

Update: 2020-08-10 13:47 GMT
ప్రస్తుత రోజుల్లో ప‌ర్సు పోతే.. మ‌ళ్లీ అది దొరికే అవకాశం చాలా తక్కువ. దాదాపుగా మళ్లీ పర్సు దొరకదు అని ఆశ‌లు వ‌దులుకోవ‌ల్సిందే. కానీ, 14 ఏళ్ల త‌ర్వాత ప‌ర్సు దొర‌క‌డ‌మంటే సాధ్యమా ..కానీ సాధ్యం అయింది. అది 2006 సంవత్సరం. ముంబైలో లోకల్ ట్రైన్ ఎక్కిన హేమంత్ పదాల్కర్, రద్దీగా ఉండటంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ నుంచి పాన్వెల్ వరకు వెళ్ళాడు. అక్కడ ట్రైన్ దిగాడు. ట్రైన్ దిగగానే చూసుకుంటే పర్స్ మిస్ అయింది. అందులో రూ.900 ఉన్నాయి. అప్పటికి ఆ డబ్బు బాగా ఎక్కువ కాబట్టి .. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు.

అయితే ర‌ద్దీగా ఉండే ట్రైన్ కాబ‌ట్టి ఎవడో కొట్టేసి ఉంటాడు. ఇక అది దొర‌క‌క‌పోవ‌చ్చని అనుకున్నారు పోలీసులు. కానీ 14 ఏళ్ల త‌ర్వాత హేమంత్‌కి పోలీసుల నుంచి కాల్ వ‌చ్చింది. మీ ప‌ర్సు దొరికింది. వ‌చ్చి తీసుకెళ్లండి అని చెప్పారు. ఇది విన్న హేమంత్ ప‌దాల్క‌ర్ షాక్ తిన్నాడు. నిజ‌మా సర్ అని ఆశ్య‌ర్య పోయాడు. వెంట‌నే ప‌ర్సు తీసుకోవ‌డానికి వాషీకి వెళ్లాడు. పూర్తిగా పాడైన అత‌ని ప‌ర్సు తీసుకొచ్చి పోలీసులు చూపించారు. ఆ ప‌ర్సు నాదే అన్నాడు. అందులో రూ.900 ఉంటాయి అన్నాడు. నిజంగానే అందులో ఉన్నాయి.

కానీ పోలీసులు ర‌ద్దైన 500 రూపాయ‌లు తీసుకుని, మిగ‌తా డ‌బ్బును ఇచ్చేశారు. ఎందుకంటే అది 2016లో ర‌ద్దైన నోటు, ఇప్పుడు చెల్ల‌దు. త్వ‌ర‌లోనే దాన్ని ఎక్స్ ఛేంజ్ చేయించి అప్పుడు రూ.500 అకౌంట్‌లోకి ట్రాన్స్ ఫ‌ర్ చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. దాంతో హేమంత్ షుఖీ అయిపోయాడు. ఇంత‌కీ ప‌ర్సు ఎక్క‌డ దొరికిందంటే.. ఇటీవ‌లే ఓ దొంగ‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ద‌గ్గ‌ర దీన్ని గుర్తించారు. ఈ విధంగా పోయిన పర్సు 14 ఏళ్ల తర్వాత దొరికింది. ఏదైనా 14 ఏళ్ల తరువాత మళ్లి పర్సు దొరికిందంటే నిజంగా అదృష్టవంతుడే
Tags:    

Similar News