ఆనందయ్య ఆయుర్వేదం.. కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. తన పూర్వీకుల నుంచి నేర్చుకున్న ఆయుర్వేద వైద్యం ద్వారా కరోనాకు మందు తయారుచేశారు ఆనందయ్య. ఇప్పటి వరకు దాదాపు 80వేల మందికి ఆయుర్వేద ముందును పంపిణీ చేశారు. ఐతే దానికి శాస్త్రీయత లేదని.. పూర్తి అధ్యయనం తర్వాత అనుమతులు ఇస్తామన్న ఏపీ ప్రభుత్వం ఆ తర్వాత ఆనందయ్య ముందుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే .. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందు తరహా మూలికల ఔషధాన్ని భారీ ఎత్తున సిద్ధం చేసి ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేసేలా ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు కాళ్లలో ప్రత్యేకంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. దాతలు, స్నేహితులు, బంధువులు, నాయకులు, కార్యకర్తల సమన్వయంతో వారం రోజులుగా ఇక్కడ మందును తయారు చేస్తున్నారు. మంగళవారం నాటికి తయారీ ప్రక్రియ పూర్తికాగా దానిని ప్యాకెట్ల రూపంలో పంపిణీకి సిద్ధం చేశారు. ఆనందయ్య ఫార్ములా ప్రకారం మందును తయారు చేసేందుకు ఆయన శిష్యుల సలహాలు, ఈ రంగంలో అనుభవం ఉన్న వారి సహకారం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రామరాజు చెప్పారు. అందుబాటులో ఉన్న మూలికలు, ఆకులను సేకరించగా మరికొన్నింటిని కొనుగోలు చేసి తయారీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ మందును ఎనిమిది గ్రాముల చొప్పున తూకం వేసి పొట్లాల రూపంలో నాయకులు, కార్యకర్తల ద్వారా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు.