ఇండియాలో హార్డ్ ఇమ్మ్యూనిటి అసాధ్యం : కేంద్రం
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. రోజురోజుకి నమోదు అయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఇప్పటికే ఇండియా లో కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. గత 24 గంటల్లో భారత్‌లో 55,079 మందికి కొత్తగా కరోనా సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 16,38,871కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 35,747కి చేరింది. దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా కరోనా కట్టడిలోకి రావడంలేదు.
ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలోలో సాధారణ ప్రక్రియ హార్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ వ్యూహాత్మక ఎంపిక లేదా ఆప్షన్ గా ఉండదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనా తో పోరాడాలి అని తెలిపారు. భారత్ లో కరోనా పరిస్థితులపై గురువారం ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మీడియా తో మాట్లాడారు.
భారతదేశానికి హెర్డ్ ఇమ్యూనిటీ అనే ఆప్షన్ ఇప్పుడు పనికిరాదు. వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం చాలా ఖర్చుతో కుడుకున్న ప్రక్రియ అని , ఈ సమయంలో దాన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవుతారు అని అన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాతనే హార్డ్ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలని రాజేష్ భూషణ్ తెలిపారు. కరోనా రోగులలో రికవరీ రేటు ఏప్రిల్‌లో 7.85 శాతం నుంచి గురువారం వరకు 64.44 శాతానికి పెరిగింది అన్నారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్ లోనే తక్కువన్నారు. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 4 శాతం ఉండగా భారత్ లో 2.21శాతంగా ఉన్నట్లు రాజేష్ భూషణ్ తెలిపారు. అలాగే దేశంలో దాదాపు 16 రాష్ట్రాల రికవరీ శాతం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉంది.