సినీనటుడు శివాజీ గత కొద్ది నెలలుగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. సూటిగా.. చురుగ్గా మాట్లాడే శివాజీ తాజాగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ శుక్రవారం ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై ఓటింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో శివాజీ అండ్ కో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని ఏపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డ ఆయన వ్యాఖ్యలు చూస్తే..
= తమ రాష్ట్ర డిమాండ్లు తీర్చుకునేందుకు.. తమ హక్కుల సాధన కోసం కృషి చేస్తూ.. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకుంటున్న టీఆర్ ఎస్ ఎంపీల్ని చూసి ఏపీ ఎంపీలు సిగ్గు తెచ్చుకోవాలి.
= ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ ఎస్ ఎంపీలు పార్లమెంటులో బలంగా నిరసన తెలపాలని నిర్ణయించారు. వెల్ లోకి దూసుకుపోవాలని భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు అలా ఒక్కసారైనా చేశారా?
= కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్ధతు ఇవ్వాలి. అలా ఇవ్వకుండా తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. ఏపీకి అన్యాయం జరిగిన పాపంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.
= బీజేపీ పగ్గాలు చేపట్టి ఇన్నేళ్లు గడుస్తున్నా.. సిగ్గూ శరం లేకుండా వ్యవహరిస్తూ.. హోదా విషయంలో కాలయాపన చేస్తున్నారు. ప్రజలు అంతా చూస్తున్నారు. ఎంపీలు చేస్తున్నది ప్రజాసేవ కాదు.. ముమ్మాటికి వ్యాపారమే. ప్రైవేటు బిల్లును ఎలా తప్పించుకోవాలా అని తెలుగుదేశం పార్టీ చూస్తుండటం చూస్తే బాధగా ఉంది.
= బిల్లు వస్తే చూద్దామని బీజేపీ ఎంపీ హరిబాబు చెప్పటం చూస్తుంటే.. బిల్లును అడ్డుకుంటారన్న అనుమానాలు పెరుగుతున్నాయి. బీజేపీ నేతలు ఒంటి నిండా విషం నింపుకున్నారు.
= ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. అంతేకానీ చంద్రబాబు వంద దేశాలకు వెయ్యి విమానాలు వేసుకొని తిరిగినా.. కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని ఖర్చు చేసినా.. ఒక్క రూపాయి కూడా పెట్టుబడిగా రాదు. ప్రత్యేక హోదా పోరాడి సాధించుకుంటే.. వంద దేశాల నుంచి కాదు.. వెయ్యి దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి (కాస్త ఎక్కువైనట్లు లేదు?). ప్రపంచం మొత్తం నుంచి ఒక్కో దేశం నుంచి ఒక్కో విమానం ఏపీకి వస్తుంది. అయ్యా మాకు కాస్త స్థలం ఇవ్వండి. మేం కంపెనీ పెడతామంటారు. ప్రత్యేక హోదాలో అంత దమ్ముంది.
= సినీ పరిశ్రమ ఎప్పుడూ రాజధానిలోనే ఉండాలి. రాజధాని నగరానికి గ్లామర్ కావాలి. అది సినీ నటులతోనే వస్తుంది. రాజధానిలో స్టూడియోలు.. గార్డెన్స్ ఉండాలే కానీ మీకు భూములున్న చోట.. మీ మంత్రులు.. వారి అనుచరులు బినామీలు ఉన్న చోట కాదు. రైతుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకున్నారు. సినీ పరిశ్రమకు అందులో ఒక్క శాతం భూమినైనా ఇవ్వలేరా?
= బెంగళూరు.. చెన్నై.. ముంబయి మహానగరాల్ని చూడండి. ఆయా రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ ఎక్కడ ఉందో తెలీదా? కేవలం నాలుగు కుటుంబాల బాగు కోసమే చూసి ఎక్కడపడితే అక్కడ చిత్రపరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తే.. అభివృద్ధి కాదు.. అన్యాయం జరుగుతుంది.
= ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబుబుకు మరో విషయం చెబుతున్నా. హోదా విషయంలో ప్యాకేజీలతో సర్దుకుపోవాలని చూస్తే.. డైరెక్ట్ గా మీ ఇంటి ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటా. వింటున్నారా సార్. మీ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటా. చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాను. చరిత్ర హీనులవుతారా? చరిత్ర పురుషులవుతారా? మీరే డిసైడ్ చేసుకోండి.
= తమాషాలు చేస్తున్నారా మీరంతా? ఏం రాజ్యం నడుస్తోందక్కడ. కేంద్రంలో ఒక్కొక్కరూ ఒక్కొక్క స్టైల్లో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనా? అని అంటున్నారు. సన్నాసుల్లారా.. ఆంధ్రప్రదేశ్ ను రెండుగా విడగొట్టిన సన్నాలు మీరంతా? ఏ ఒక్కడికి అర్హత లేదు. మనుషులు కాదు మీరు. ప్రత్యేక హోదా అంటే అంత చిన్న చూపా? ఆ రోజు గడ్డి తిని హామీలు ఇచ్చారా?
= అందరూ కలిసి ఏపీ హక్కుల్ని కాపాడుకునేందుకు నడుం బిగించాలి. రాష్ట్రాన్ని విభజించి.. కాంగ్రెస్ దిద్దుకోలేనితప్పు చేసి.. ప్రజల ఛీత్కారాన్ని చూస్తోంది. తెలుగుదేశానికి కూడా అదే గతి పట్టకుండా ఉండేలా చూసుకోవాలి.