వెన్నుపోటు కాదు.. వెన్నుదన్ను

Update: 2019-01-02 14:53 GMT
హీరో శివాజీ టీడీపీలో చేరలేదు. ప్రస్తుతం అతను ఏ పార్టీలో లేడు. కానీ టీడీపీకి వెన్ను దన్నుగా నిలబడుతున్నాడు శివాజీ. గతేడాది ఆపరేషన్‌ గరుడతో సంచలనం సృష్టించిన శివాజీ.. కొత్త ఏడాదిలో ఆపరేషన్‌ గరుడ 2 అంటూ రహస్యాల్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా కొంతమంది అధికారులు చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాని అన్నారు. ఈ సందర్భంగా.. ఆర్జీవీ తీస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌పై మాట్లాడాడు శివాజీ.

రామ్‌గోపాల్‌ వర్మ రిలీజ్‌ చేసిన వెన్నుపోటు పాట గురించి శివాజీ ప్రస్తావిస్తూ.. చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదని అన్నాడు. టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడిన నాయకుడు చంద్రబాబు అంటూ పొగిడేశాడు. చంద్రబాబు, కేసీఆర్‌, ఎర్రబెల్లి లాంటి నాయకులంతా పార్టీని కాపాడుకునేందుకు.. అసలు చంద్రబాబే లేకుంటే తెలుగుదేశం పార్టీ అనేదే ఉండేది కాదని శివాజీ అన్నాడు. ఇవన్నీ తెలీకుండా, తెలుసుకోకుండా రామ్‌గోపాల్‌ వర్మ సినిమా తీస్తున్నారని ఆరోపించారు. కేవలం చంద్రబాబు ముందుచూపు వల్లే వాజ్‌పేయి రెండోసారి ప్రధాని అయ్యారని శివాజీ గుర్తుచేశారు. ప్రస్తుతానికి టీడీపీ వర్గాల కంటే ఎక్కువుగా టీడీపీని, చంద్రబాబుని మోస్తున్న శివాజీ.. రేపో మాపో టీడీపీ కండువా కప్పుకునేట్లే కన్పిస్తున్నాడు. మరి శివాజీ వ్యాఖ్యపై వర్మ ఏ విధంగా కౌంటర్‌ ఇస్తాడో వెయిట్‌ అండ్‌ సీ.
Tags:    

Similar News