మాట తప్పడం....మడమ తిప్పడం....మా వంశంలోనే లేదురా.....ఇది ఓ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలోని ఫేమస్ డైలాగ్. ఆ డైలాగ్ దివంగత నేత, ప్రజల మనిషి వైఎస్ రాజ శేఖర రెడ్డికి అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ప్రజాసమస్యలు తెలుసుకోవడం కోసం పట్టుదలతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత మహానేత వైఎస్ ఆర్ ది. పులి కడుపున పులే పుడుతుందన్న రీతిలో....ఆ ప్రజానాయకుడి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన యువకెరటం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తన తండ్రిలాగే అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా....నిర్విరామంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్....ఈ చలివాతావరణంలో.....తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పటికీ....చెక్కుచెదరని అంకితభావంతో పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. వాస్తవానికి కొద్ది విరామం ఇచ్చిన తర్వాత....పాదయాత్రను కొనసాగించే అవకాశమున్నాకూడా....దానిని ఉపయోగించుకోలేదు. అయితే, ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా పాదయాత్రకు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ ను చూసేందుకు ఆయన సతీమణి భారతి ఈ రోజు చంద్రగిరి రానున్నారు. మార్గమధ్యంలోనే జగన్ సంక్రాంతి పండగను జరుపుకోనున్నారు. ఈ విధంగా తన గురించి ఆలోచించకుండా....ప్రజాసంక్షేమమే పరమావధిగా అలుపెరగకుండా పాదయాత్ర చేస్తున్న ఆ ప్రజానేతకు తమిళ స్టార్ హీరో సూర్య ఫిదా అయిపోయారు.
అకుంఠిత దీక్షతో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన జగన్ కు ప్రముఖ తమిళ నటుడు సూర్య మద్దతు పలికారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన, గొప్ప ఆలోచన, ఆశయాలతో వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు అని సూర్య అన్నారు. తాను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచే వైఎస్ కుటుంబంతో పరిచయం ఉందన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలాగా....అనుకున్నది సాధించే వరకు కష్టపడేతత్వం ఉన్న నేత జగన్ అని చెప్పారు. తాను, జగన్ కలిసి మాట్లాడుకున్నపుడు .....రాజకీయాల గురించి పెద్దగా చర్చించమని, ప్రజా సేవ చేయాలన్న తపన ఆయనలో ఎప్పుడూ కనిపిస్తుందన్నారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డిని కోల్పోవడం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని సూర్య అభిప్రాయపడ్డారు. మహానేత వైఎస్ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైనట్లుగానే....జగన్ చేస్తున్న పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు సూర్య తెలిపాడు.