నామా నాగేశ్వరరావు.. మొన్నటి అసెంట్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మూడు నెలలు గడిచాయి. నామా టీఆర్ఎస్ లో చేరారు. ఖమ్మం ఎంపీ సీటును పొందారు.. టీఆర్ ఎస్ అండతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
అయితే నామా నాగేశ్వరరావుకు అండగా ఈసారి టీఆర్ ఎస్ పార్టీ తరుఫున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగాడు స్టార్ క్యాంపెయినర్ హీరో వేణు. ఇదే హీరో మొన్నటి అసెంట్లీ ఎన్నికల సందర్భంగా పసుపు కండువా వేసుకొని ఖమ్మం అసెంబ్లీలో టీడీపీ గుర్తు సైకిల్ ఎక్కి తొక్కుతూ ఓ రేంజ్ లో ప్రచారం చేశాడు. ఇప్పుడు మళ్లీ నామా గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కరుడు గట్టిన టీడీపీ వాదిగా ప్రచారం చేసిన వేణు ఇప్పుడు దానికి అపోజిట్ గా టీఆర్ ఎస్ తరుఫున ప్రచారానికి రావడంతో జనాలు విస్తుపోతున్నారు. నేతలు మారినట్టే హీరో వేణు కూడా ఇలా మారడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
ఫ్యాక్షన్ సినిమాల సీనియర్ దర్శకుడు బి. గోపాల్ కు స్వయానా మేనల్లుడు హీరో వేణు. నామా నాగేశ్వరరావుకు బావమరిది. ఫ్యామిలీ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇలా బావ కళ్లల్లో ఆనందం కోసం నాడు టీడీపీ తరుఫున పచ్చ కండువాలు వేసుకొని ప్రచారం చేసినా వేణు.. ఇప్పుడు గులాబీ కండువా వేసుకొని ఖమ్మం పార్లమెంట్ బరిలో ప్రచారం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో నామా తరుఫున ప్రచారంలో పాల్గొన్న వేణు ఓ హోటల్ లో బజ్జీలు వేస్తూ టీఆర్ ఎస్ అభ్యర్థి నామాను గెలిపించాలని కోరారు. ఇలా ఎన్నికల వేళ నేతల పార్టీలు మార్చేడమే కాదు.. వారి తరుఫున స్టార్ క్యాంపెయినర్లు కూడా జెండాలు మార్చేయడం విశేషంగా చెప్పవచ్చు.