సోషల్ మీడియా పుణ్యమా అని కొన్ని గాలి కబుర్లు సైతం ప్రధాన వార్తలుగా మారుతున్న సందర్భాల గురించి తెలిసిందే. ఆ కోవకే చెందింది ఈ ఉదంతం. ఎవరు పుట్టించారో కానీ.. సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టు.. దాని లాజిక్ ఇట్టే సరిపోవటంతో అది కాస్తా వైరల్ గా మారటం.. దానిపై పెద్ద ఎత్తున జరగటమే కాదు.. ఆ ఎపిసోడ్ తో ఏ మాత్రం సంబంధం లేని ఒక స్టార్ హీరో గతంలోనూ క్లారిటీ ఇచ్చారు. తాజాగా మరోసారి పలువురి మదిలో ఉన్న సందేహాన్ని తీర్చేస్తూ మరింత స్పష్టత ఇచ్చారు.
తెలుగు మూలాల్ని వెతికి మరీ.. తమిళ స్టార్ హీరో విశాల్ వచ్చే ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడతారని.. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద పోటీ చేస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో రావటం.. అది కాస్తా వైరల్ గా మారటం తెలిసిందే.
ఈ గాలి వార్త మూలాల్ని వెతికేందుకు తెలుగు దేశం పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. చాలామంది ఇది అబద్ధమని చెప్పినా.. నిప్పు లేనిదే పొగ రాదన్న సామెతను గుర్తు చేస్తూ దాని మూలాల్ని వెతికే ప్రయత్నం చేశారు.
ఎందుకంటే.. విపక్ష అధినేతకు సంబంధించిన అంశం కావటం.. ఇలాంటి ట్విస్టులు ఇచ్చే ఇమేజ్ వైసీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఉండటంతో తెలుగు తమ్ముళ్లలో టెన్షన్ ఒక రేంజ్ లో వెళ్లిన పరిస్థితి. ఆ సందర్భంగా విశాల్ కు చెందిన వారు.. అదంతా ఉత్తదేనని.. కుప్పం నుంచి పోటీ చేయాలన్న ఆలోచన విశాల్ కు లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా విశాల్ నటించిన లత్తి తమిళ మూవీని లాఠీ పేరుతో తెలుగులో విడుదల చేయటం తెలిసిందే.
ఈ వారాంతంలో థియేటర్లలో సందడి చేయనున్న ఈ మూవీకి సంబంధించిన కార్యక్రమం ఒకటి చెన్నైలో జరిగింది. ఆ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే క్రమంలో హీరో విశాల్ కు మరోసారి కుప్పం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్న ప్రచారంపై ప్రశ్నించటంతో ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.
తనకు అలాంటి ఆలోచనలు లేవని చెప్పటమే కాదు.. తాను రాజకీయాల్లోకి వస్తానని.. కాకుంటే సామాజిక సేవే ప్రధానంగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే.. 2024 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మీద పోటీ చేయాలని మాత్రం తాను అనుకోవటం లేదని స్పష్టం చేశారు. కుప్పంతోనూ.. ఆ ప్రాంత ప్రజలతోనూ తమ కుటుంబానికి అనుబంధం ఉందన్న విషయాన్ని వెల్లడించిన విశాల్.. తన తండ్రికి కుప్పంలో గ్రానైట్ వ్యాపారం చేసేవారని. అక్కడే తాము మూడేళ్లు ఉన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి వస్తాను కానీ ఇప్పుడే కాదన్న ఆయన మాట ఇప్పుడు తమిళనాడులో ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.