భ‌ట్టికి హైక‌మాండ్ పిలుపు.. ఏం జ‌ర‌గ‌బోతోంది?

Update: 2021-07-01 16:21 GMT
తెలంగాణ పీసీసీ విష‌యంలో హైక‌మాండ్ వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. నిన్నామొన్న‌టి వ‌ర‌కు పీసీసీ ఎంపిక ఎప్పుడు పూర్త‌వుతుందో అన్న‌ట్టుగా ఉండ‌గా.. ఇప్పుడు వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. మొన్న‌టికి మొన్న తెలంగాణ కాంగ్రెస్ మ‌హిళా అధ్య‌క్షురాలిని ఎంపిక చేసిన అధిష్టానం.. ఆ మ‌రుస‌టి రోజే.. పీసీసీ అధ్య‌క్షుడిని ప్ర‌క‌టించింది.

అయితే.. రేవంత్ కు ఇవ్వ‌డాన్ని ముందునుంచీ వ్య‌తిరేకించిన‌ సీనియ‌ర్లు.. ఆ త‌ర్వాత బ‌హిర్గ‌తం కాక‌పోయిన‌ప్ప‌టికీ లోప‌ల మాత్రం అసంతృప్తిగానే ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. పీఠం కోసం చివ‌రి వ‌ర‌కు పోరాటం చేసిన కోమ‌టిరెడ్డి మాత్ర‌మే బ‌య‌ట‌కు వెళ్ల‌గ‌క్కారు.

రేవంత్ మాత్రం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప‌ద‌వి ప్ర‌క‌టించిన త‌ర్వాత కాంగ్రెస్ లోని సీనియ‌ర్ల‌ను వ‌రుస‌గా క‌లుస్తున్నారు. జానారెడ్డిని, వీహెచ్ ను క‌లిసిన రేవంత్‌.. ఆ త‌ర్వాత జ‌రిగిన పీసీసీ భేటీలో అంద‌రినీ క‌లుపుకునే వెళ్తాన‌ని అన్నారు. తాను చిన్న‌వాడిని అంటూ.. సీనియ‌ర్ల‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. ఉన్న‌ట్టుండి సీఎల్పీ నేత‌గా ఉన్న‌ బట్టికి పిలుపురావ‌డంతో అంద‌రిలో అటెన్ష‌న్ క్రియేట్ అయ్యింది. ఎందుకు పిలిచింది? అని చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. సీనియ‌ర్ల విష‌యంలో ఉన్న అసంతృప్తి విష‌యం గురించి ఆరాతీసేందుకే పిలుపు వ‌చ్చిందని అంటున్నారు. భ‌ట్టి విక్ర‌మార్క తిరిగి వ‌స్తే త‌ప్ప‌, ఈ విష‌య‌మై క్లారిటీ వ‌చ్చేలా లేదు.
Tags:    

Similar News