తెలంగాణ ఓటర్ల జాబితా అవకతవకలపై ఉమ్మడి హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఆ జాబితా గురించి హైకోర్టు తుది తీర్పును అనుసరించి తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ లో మార్పులు చేర్పులూ ఉంటాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆ పిటిషన్లపై హైకోర్డు జరపనున్న విచారణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. అయితే, ఆ పిటిషన్లపై విచారణను ఉమ్మడి హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఆ పిటిషన్లపై ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయడంతో విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో పాటుఎ, తెలంగాణ శాసనసభ రద్దును సవాల్ చేస్తూ డీకే అరుణ దాఖలు చేసిన మరో పిటిషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది. శాసనసభ రద్దు రాజ్యాంగబద్ధంగా జరగలేదని డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం దీనిపై విచారణ జరిగే అవకాశముంది.
అక్రమ ఓటర్ల జాబితాతో మరోసారి అధికారం చేపట్టేందుకు కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించిన 14 అంశాలపై మర్రి శశిధర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ఆ పిటిషన్ తో పాటు మరో 3 పిటిషన్ లు దాఖలయ్యాయి. అయితే, గత శుక్రవారం రెండు పిటిషన్ లు కొట్టేశారు. మర్రిశశిధర్ రెడ్డితో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. మరోవైపు, ఎమ్మెల్యేలకు కూడా చెప్పకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని అరుణ ఆరోపించారు. మంత్రిమండలి తన పరిధిని దాటి అసెంబ్లీ రద్దుచేసిందని, గవర్నర్ కూడా వెంటనే అసెంబ్లీ రద్దుకు ఆమోదించారని డీకే అరుణ ఆ పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపరచకుండా, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే అసెంబ్లీని రద్దు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆమె తరఫు న్యాయవాది అన్నారు. మధ్యాహ్నం జరగనున్న విచారణపై ఉత్కంఠ ఏర్పడింది