ఎంపీ జ‌య‌దేవ్‌ కు షాక్‌..సీఎం ర‌మేష్‌ కే ప‌గ్గాలు

Update: 2015-08-18 15:18 GMT
ఏపీ ఒలింపిక్ సంఘం గుర్తింపు  విష‌యంలో గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌ కు షాక్ త‌గిలింది. రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత ఏపీ ఒలింపిక్ సంఘం ప‌గ్గాల కోసం టీడీపీ ఎంపీ లైన‌ సీఎం ర‌మేష్‌, గ‌ల్లా జ‌య‌దేవ్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. వీరిద్ద‌రు తామే ఏపీ ఒలంపిక్ సంఘం అధ్య‌క్షుల‌మంటూ వేర్వేరుగా ప్ర‌క‌టించుకున్నారు. దీంతో అస‌లు అధ్య‌క్షుడు ఎవ‌రో తెలియ‌కుండా పోయింది.

గ‌ల్లా జ‌య‌దేవ్ వ‌ర్గం త‌ర‌పున పురుషోత్తం నాయుడు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌ ను మంగ‌ళ‌వారం హైకోర్టు కొట్టివేయ‌డంతో సీఎం ర‌మేష్ వ‌ర్గం ఎన్నిక‌కు మార్గం సుగ‌మ‌మైంది. గ‌త ఏప్రిల్‌లో వీరిద్ద‌రు వేర్వేరుగా తామే ఏపీ ఒలంపిక్ సంఘం అధ్య‌క్షుల మంటూ ఎవ‌రికి వారే ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేసుకున్నారు.

అప్ప‌టి వ‌ర‌కు స‌మైక్య రాష్ర్ట ఒలింపిక్ సంఘం అధ్య‌క్షుడిగా ఉన్న విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ్‌ గోపాల్ సీఎం ర‌మేష్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చారు. అప్పుడే తెలంగాణ ఒలంపిక్ సంఘం అధ్య‌క్షుడిగా మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్‌ రెడ్డి ఎన్నిక‌య్యారు. అప్ప‌ట్లో సీఎం ర‌మేష్‌ కు మ‌ద్ద‌తుగా చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఉండి చ‌క్రం తిప్పార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. లోకేష్ జ‌య‌దేవ్‌ కు ఫోన్ చేసి త‌ప్పుకోవాల‌ని సూచించినా కూడా ఆయ‌న ప‌ట్టువీడకుండా బ‌రిలో ఉన్నారు. తాజాగా ఆయ‌న వ‌ర్గం పిటిష‌న్‌ ను హైకోర్టు తిర‌స్క‌రించ‌డంతో ర‌మేష్ వ‌ర్గానికి లైన్ క్లీయ‌ర్ అయ్యింది.
Tags:    

Similar News