బాబుకు దెబ్బ‌!..ఏపీ పిటిష‌న్ కొట్టివేత‌!

Update: 2019-01-19 12:12 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వేస్తున్న ప్లాన్లు ఇటీవ‌లి కాలంలో అట్ట‌ర్ ఫ్లాప్‌ గా మారుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌లు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎలా చేప‌డుతుందంటూ చంద్ర‌బాబు చేస్తున్న నానా యాగీకి ఇప్పుడు ఏపీ హైకోర్టు బ్రేకులు వేసింది. విప‌క్ష నేత హోదాలోని జ‌గ‌న్‌ పై దాడి జ‌రిగితే... ఓ ప్ర‌భుత్వాధినేత‌గా చాలా వేగంగా స్పందించ‌డంతో పాటు కేసు నిష్పాక్షిక ద‌ర్యాప్తున‌కు ఆదేశించ‌డంతో పాటుగా ద‌ర్యాప్తులో నిజానిజాలు వెల్ల‌డ‌య్యేలా యంత్రాంగాన్ని అప్ర‌మ‌త్తం చేయాల్సిన చంద్ర‌బాబు... అస‌లు జ‌గ‌న్‌ పై జ‌రిగిన దాడిని... దాడిగానే ప‌రిగ‌ణించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సానుభూతి కోసం జ‌గ‌నే త‌న‌పై తానే దాడి చేయించుకున్నార‌ని విష ప్ర‌చారం చేశారు. అంతేకాకుండా ఏకంగా డీజీపీ స్థాయి అధికారితో ఈ దాడి చాలా చిన్న‌దేన‌న్న భావ‌న క‌లిగేలా ప్ర‌క‌టన ఇప్పించారు. అయితే చంద్ర‌బాబు కుటిల య‌త్నాల‌ను ముందే ప‌సిగ‌ట్టిన జ‌గ‌న్‌... ద‌ర్యాప్తును కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌కు అప్ప‌గించాల‌ని ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. జ‌గ‌న్ వాద‌న‌కే మొగ్గు చూప‌గా... జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) కేసును టేక‌ప్ చేసింది.

అయితే ఎన్ ఐఏ ద‌ర్యాప్తు చేస్తే... ఈ కేసులోని అస‌లు నిజాలు ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డి... త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తే ప్ర‌శ్నార్థ‌కం అవుతుందేమోన‌ని భయ‌ప‌డే మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు... ఈ కేసు ద‌ర్యాప్తు బాధ్య‌త‌ల నుంచి ఎన్ ఐఏను త‌ప్పించేలా వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ప‌రిధిలో జ‌రిగిన ఈ కేసు ద‌ర్యాప్తును రాష్ట్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని రాష్ట్ర పోలీసులు చేప‌డుతుండ‌గా... కేంద్రం పెత్త‌నం పెరిగేలా జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌ల ఆధిప‌త్య‌మేమిట‌ని చంద్ర‌బాబు స‌ర్కారు కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చింది. ఇదే వాద‌న‌ను కోర్టు ముందు కూడా వినిపించేసి... త‌న ప‌ని పూర్తి చేయాల‌ని చంద్ర‌బాబు భావించారు. ఆ క్ర‌మంలోనే నిన్న హైకోర్టుకు త‌న అధికారుల‌ను కాస్తంత లేటుగా పంపి... కోర్టులో ప్ర‌భుత్వ పిటిష‌న్‌కు నెంబ‌ర్ దొర‌క‌కుండా చాలా ప్లాన్డ్ గా మంత్రాంగం న‌డిపారు.

ఆ ప్లాన్‌ లో భాగంగానే తాజాగా నేడు హైకోర్టులో ఈ విష‌యంపై పిటిష‌న్ దాఖ‌లు చేసిన చంద్ర‌బాబు స‌ర్కారు... దీనిని అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని - అందుకే దీనిని హౌస్ మోష‌న్ పిటిష‌న్ కింద దాఖ‌లు చేస్తున్న‌ట్లు క‌ల‌రింగ్ ఇచ్చింది. అయితే ఈ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన హైకోర్టు... ఈ పిటిష‌న్ అంత అత్య‌వ‌స‌ర‌మైన‌దిగా త‌న‌కు అనిపించ‌డం లేద‌ని చెబుతూ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించేసింది. ఎలాగూ ఈ పిటిష‌న్ సాధార‌ణ పిటిష‌న్‌ గా వెళితే... హైకోర్టులో ఎలాంటి దెబ్బ త‌గులుతుందో తెలిసిన కార‌ణంగానే... హౌస్ మోష‌న్ పిటిష‌న్ రూపంలో ఈ విష‌యాన్ని కోర్టు ముందు పెట్టి... తాత్కాలిక ఉత్త‌ర్వులు ఇప్పించుకుని ఎన్ ఐఏను నిలువ‌రించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కారు య‌త్నించింది. అయితే చంద్ర‌బాబు ప్లాన్ ఏమిట‌న్న విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోని కోర్టు... ఈ పిటిష‌న్ ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మొత్తంగా చంద్ర‌బాబుకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింద‌నే చెప్పాలి.


Full View

Tags:    

Similar News