తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలపై హాట్.. హాట్ గా చర్చలు సాగుతుంటే.. మరోవైపు హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. తెలంగాణ.. ఏపీలలోని రైతుల ఆత్మహత్యలు చేసుకోవటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తే సరిపోతుందా? అసలు రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశం మీద అధ్యయనం చేశారా? అంటూ రెండు తెలుగు ప్రభుత్వాలను నిలదీసింది.
రైతుల ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టలేరా? అని ప్రశ్నించిన హైకోర్టు.. అక్టోబరు 13 నాటికి ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని రెండు రాష్ట్ర సర్కారుల్ని ఆదేశించింది. రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తెలుగు ప్రభుత్వాలకు హైకోర్టు అగ్రహం ఇబ్బంది పెట్టేదే.