పొంగూరు నారాయణ... ఏపీ కేబినెట్ లో కీలక శాఖ అయిన పురపాలక శాఖ మంత్రిగానే కాకుండా... నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్న సీఆర్డీఏకు ఉపాధ్యక్షుడిగానే ఉన్నారు. గడచిన ఎన్నికల్లో టీడీపీ కావలసిన మేర ఆర్థిక సంపత్తిని సమకూర్చి పెట్టారని తెగ ప్రచారంలోకి వచ్చిన నారాయణకు ఎమ్మెల్యే హోదా లేకున్నా ఆ తర్వాత చంద్రబాబు తన కేబినెట్ లో కీలక పోస్టింగిచ్చారు. ఆ పోస్టింగ్ సరిపోదనుకున్నారో... ఏమో తెలియదు గానీ... సీఆర్డీఏకు ఉపాధ్యక్షుడిగానే చేశారు.
నారాయణ నేతృత్వంలోని సీఆర్డీఏ అధికారులు... అమరావతిలో తమకిష్టమైన రీతిలో వ్యవహరిస్తూ ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కూడా నారాయణ అండ్ బ్యాచ్ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని సీఎం చెబుతుంటే... మీరు మాత్రం క్షేత్ర స్థాయి పర్యటనలు వదిలేసి ఏసీ కారుల్లో తిరిగితే ఎలాగంటూ కాస్తంత ఘాటుగానే కడిగిపారేసింది.
అసలు హైకోర్టు నారాయణ అండ్ టీంను ఎందుకు మందలించిదన్న విషయంలోకి వస్తే... సీఆర్ డీఏ పరిధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్న నేపథ్యంలో పలువురు పిటిషనర్లు 2016లో హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర స్టే ఆదేశాలు పొందారు. ఇలా దాఖలైన 50కి పైగా ఉన్న పిటిషన్లు నిన్న మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తూ... గ్రామ పంచాయతీలు - మున్సిపాలిటీల పరిధిలో గ్రౌండ్+2 నిర్మాణాలకు అనుమతిస్తున్నారని, అంతకు మించి నిర్మాణాలు చేపట్టాలంటే సీఆర్డీఏ నుంచి అనుమతి అవసరమన్నారు. సీఆర్డీఏకు దరఖాస్తులు చేసుకున్నా అధికారుల నుంచి స్పందన రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దశలో కల్పించుకున్న న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం... సీఆర్డీఏ తరఫు న్యాయవాదిని వివరణ కోరారు. కోర్టు అడిగిన వివరణకు సరిగా బదులివ్వక పోవడంతో న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కారుల్లో తిరిగితే అయిపోతుందా...? అని న్యాయమూర్తి నిలదీశారు. మరి కోర్టు అక్షింతలతోనైనా... నారాయణ అండ్ బ్యాచ్ ఏసీ కార్లను వదిలేసి క్షేత్రస్థాయి పర్యటనకు పూనుకుంటుందో, లేదో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/