కరోనా లెక్కలు దాచి ఏం సాధిస్తారు - తెలంగాణకు హైకోర్టు ప్రశ్న

Update: 2020-06-08 17:30 GMT
కరోనా పరీక్షలు సరిగా చేయకపోవడమే కాకుండా... కరోనా వివరాలేమీ సరిగా చెప్పడం లేదన్న విషయంపై దాఖలపై వ్యాజ్యాలను ఈరోజు హైకోర్టు విచారించింది. కరోనా గణాంకాలు దాయడం లాభం చేకూర్చకపోగా దానివల్ల ప్రమాదమని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కరోనా గణాంకాలను సరైన రీతిలో ప్రచారం చేయడం లేదని, ఇకపై అన్ని రకాల వేదికలపై కరోనా పరీక్షల వివరాలు, ఇతర గణాంకాలు ప్రచారం చేయండి, ఇవన్నీ ప్రజలకు తెలియాలని హైకోర్టు తెలంగాణ గవర్నమెంటును ఆదేశించింది.

కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలకు కరోనా తీవ్రత తెలియడం వల్ల ఉపయోగమే గాని నష్టం లేదు. అందుకే తగినంత అవగాహన కల్పించండి. ప్రతి రోజు విడుదల చేసే మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఉండరాదని ఆదేశించిన కోర్టు... ఒకవేళ తప్పుడు లెక్కలు ఇచ్చినట్టు తెలిస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని... ఇది కనీస విచక్షణ, ఈనెల 17వ తేదీలోపు ఈ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయనందుకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డైరెక్టర్ శ్రీనివాస్ రావు హాజరుకావాలని 17న కోర్టుకు రావాలని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.
    

Tags:    

Similar News