ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతునే ఉన్నాయి. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి చేయాల్సిన చికిత్సకు కొరత ఉన్న క్రమంలో ఈ అంశంపై ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందుల కొరతపై ప్రభుత్వం ఏం చేస్తోంది, అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ముఖ్య అవసరమైన సూది మందు కొరతపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన వివరాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సోమవారం నాటికి పూర్తి వివరాలు అందించాలని ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంజక్షన్ తయారీకి అవసరమైన ముడిసరకు లభ్యత తక్కువగా ఉందని, కంపెనీలు ముడిసరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయని న్యాయవాదులు కోర్టుకి వివరించారు. 9 లక్షలకు పైగా డోసులు అవసరమైతే కేవలం 2 లక్షల 17 వేలు మాత్రమే సరఫరా చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాల వారిగా కేటాయింపుల వివరాలు ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు ఆనందయ్య మందు గురించి విచారణ పూర్తి అయ్యిందని, సోమవారం ఆదేశాలు వెల్లడిస్తామని హైకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. కాగా బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని వైద్య అధికారులకు సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.
కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించి వైద్య అధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈసమావేశంలో బాధితులకు తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏపీని కరోనా మహమ్మారి పెరుగుతున్న క్రమంలో దీనికి తోడు రోజురోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ గత మూడు రోజుల క్రితం వరకూ దాదాపు 2000 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా.. ఇందులో 14 మంది బ్లాక్ ఫంగస్ కారణంగా చనిపోయారు. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగి బ్లాక్ ఫంగస్ బాధితులుగా మారుతున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏపీలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ప్రభుత్వానికి సవాల్‌గా మారాయి. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారికి వైద్యంలో భాగంగా ఇచ్చే యాంఫోటెరిసిన్ బీ వయల్స్ కొరత కూడా ఏపీని వేధిస్తోంది.