ఆర్టీసీ ప్రైవేటీకరణ.. కేసీఆర్ కు హైకోర్టు షాక్

Update: 2019-11-08 10:23 GMT
ఈనెల 5వ తేదీలోగా సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరకపోతే మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తానని కేసీఆర్ మొన్నటి కేబినెట్ మీటింగ్ తర్వాత చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 5100 బస్సు రూట్లను ప్రైవేటీకరిస్తున్న కేసీఆర్ ప్రకటించారు.

అయితే కార్మికులు ఎవరూ సమ్మె విరమించకపోవడం.. 5వ తేదీ డెడ్ లైన్ ముగిసిపోవడంతో ఇక ఆర్టీసీలోని  సగం 5100 బస్సుల రూట్లను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.

దీనిపై తాజాగా ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు హైకోర్టు అత్యవసర పిటీషన్ దాఖలు చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అమలు కాకుండా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించాడు. దీనిని పరిశీలించిన హైకోర్టు కేసీఆర్ సర్కారు షాక్ ఇచ్చింది. ఈనెల 11వ తేదీ వరకు ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అదే సమయంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాల ప్రొసీడింగ్స్ ను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు సూచించింది.

ఇక ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణ విషయంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి కూడా హైకోర్టు షాకిచ్చింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరించేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కేసీఆర్ సర్కారు ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎలాంటి ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్ ముందరికాళ్లకు హైకోర్టు బంధం వేసినట్టైంది. 
Tags:    

Similar News