వీడియో ఛాటింగ్ విప్లవం స్కైప్ ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో ఉపయోగపడుతుంది. ఆలోచన ఉండాలే కానీ టెక్నాలజీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నిరూపణ అయింది. చెన్నైలోని ఓ న్యాయమూర్తి ఏకంగా స్కైప్ సహాయంతో ఆదేశాలు వెలువరించడం విశేషం.
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఒకరు వీడియో ఛాటింగ్ సైట్ స్కైప్ ద్వారా ఒక కేసులో ఆదేశాలు జారీ చేశారు. రామనాథపురం జిల్లాలోని చర్చిలో వివాహం చేసుకోవాలనుకున్న దంపతులు తమకు రక్షణ కల్పించాల్సిందిగా మద్రాసు హైకోర్టును కోరారు. కాగా వారికి తగిన రక్షణ కల్పించాల్సిందిగా మధురై బెంచ్ న్యాయమూర్తి ఎస్. వైద్యనాథన్ పోలీసులను ఆదేశించారు.
అయితే వైద్యనాథన్ ఈ కేసును నేరుగా కాకుండా స్కైప్ ద్వారా తన నివాసం నుంచే విని తగిన ఆదేశాలు జారీ చేశారు. న్యాయమూర్తులు దీపావళి సెలవుల్లో ఉండటంతో అందుబాటులో ఉన్న మధురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. వైద్యనాథన్‌ను ఈ కేసును చేపట్టాల్సిందిగా మద్రాసు హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ బెంచ్ న్యాయమూర్తి వి. రామసుబ్రహ్మణ్యన్ కోరారు. ఆయన కూడా సమయానికి అందుబాటులో లేకపోయినా స్కైప్ సహాయంతో విచారిస్తానని చెప్పి కేసును విని ఆదేశాలిచ్చారు. న్యాయస్థానంలో కేసు విచారణ, ఆదేశాలివ్వడం కోసం స్కైప్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి అని మద్రాసు హైకోర్టు వర్గాలు తెలిపాయి.