ఎమ్మెల్యేల ఎర కేసు: బీఆర్ఎస్, బీజేపీపై హైకోర్టు సీరియస్.. సీబీఐ ట్విస్ట్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయం హైకోర్టుకు చేరింది. సింగిల్ జడ్జి కేసును సీబీఐకి అప్పగించగా.. దీనిపై కేసీఆర్ సర్కార్ హైకోర్డు డివిజన్ బెంజ్ కు ఎక్కింది. ఈ కేసును సిట్ కే అప్పగించాలని.. సీబీఐకి ఇస్తే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నీరుగారుస్తుందని వాదించింది. ఈ క్రమంలోనే హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాల కోసం న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హైకోర్టు హితవు పలికింది. ఈ కేసుపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాసింది సీబీఐ. సిట్ మాకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని.. ఇస్తే దర్యాప్తు చేస్తామని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. అయితే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని హైకోర్టు సీబీఐకి సూచించింది.
ఈ క్రమంలోనే సీబీఐ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగిస్తూ షాకిచ్చింది. ఈ కేసులో ముందుకే వెళ్లాలని సీబీఐ డిసైడ్ అయ్యింది.
అయితే సీబీఐకి అప్పగించడాన్ని కేసీఆర్ సర్కార్ హైకోర్టులో సవాల్ చేసింది. సర్కార్ పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టులో వాడీ వేడి వాదనలు జరిగాయి. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తారని.. ఆయన ఢిల్లీలో ఉన్నారని.. ఆన్ లైన్ విధానంలో విచారణ జరపాలని ఏజీ కోరడంతో హైకోర్టు అంగీకరించింది. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వర్చువల్ విధానంలో విచారణ చేపడుతామని ధర్మాసనం తెలిపింది.
ఇక కేసీఆర్ ప్రభుత్వం వేసిన పిటీషన్ లో జోక్యం చేసుకోవద్దని.. కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి బీజేపీకి, నిందితుకలు నష్టం కలిగించేలా వీడియోలు లీక్ చేశారని.. కేసు ప్రభావితం చేసిన దృష్ట్యా దీన్ని బీజేపీకి అప్పగించడమే మేలు అన్నారు. తమ పిటీషన్ ను సింగిల్ జడ్జి కొట్టివేసినప్పటికీ అభ్యర్థనను అంగీకరించారు కాబట్టి సీబీఐకి అప్పగించడమే మేలు అని బీజేపీ, ఇతర నిందితులు వాదించారు.
ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ లు రాజకీయ అంశాలను హైకోర్టును వేదికగా చేసుకోవద్దని.. అదంతా బయట చూసుకోవాలని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనిపై సోమవారం విచారణ జరిపి స్పష్టతనిస్తామని.. అప్పటివరకూ ఆగాలని సీబీఐకి సూచించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.