ఒక పార్టీ నుంచి గెలిచి... అధికార యావ..... అధికారంలో ఉన్న వాళ్లు విసిరిన డబ్బుల సంచుల కోసం కన్న పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారిన వారి పాపం తాజాగా పండుతోంది. తాజాగా మడకశిర ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశాక.. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి మారిన వారిపైన కూడా అనర్హత వేటు వేయాలనే డిమాండ్ కూడా ఊపందుకుంది. మడకశిర ఎమ్మెల్యే పై వేటు వేసిన హైకోర్టు అక్కడ వైసీపీకి చెందిన తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రకటించాలని కోర్టు తీర్పునిచ్చింది. మరి ఈ విషయంలో స్పీకర్ ఏం చేస్తాడన్నది వేచి చూడాల్సి ఉంది.
అయితే తాజాగా ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు జారీ కావడంతో వారంతా అవాక్కైనట్టు సమాచారం. ఎనిమిది నెలల కిందట వివరణ కోరిన హైకోర్టు ఎవ్వరూ స్పందించకపోయే సరికి తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరవై రెండు మందికి ఈ నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో స్పందించకుండా ఉన్న ఏపీ స్పీకర్ ను కూడా ప్రతివాదిగా చేస్తూ కోర్టు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
ఫిరాయింపు దారుల పై వైసీపీ ఏనాడో హైకోర్టు - సుప్రీం కోర్టు తలుపు తట్టింది. కానీ మన న్యాయవ్యవస్థలో ఉన్న జాప్యం - లొసుగులతో ఇన్ని ఏళ్లుగా వారంతా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. వీరి పై ఎప్పుడో అనర్హత వేటు వేయాల్సి ఉంది.కానీ జాప్యం జరుగుతోంది.
పోనీ కోర్టులు ఆదేశించినా కానీ వేటు వేయాల్సిన వ్యవస్థను ఏపీ సీఎం చంద్రబాబు మేనేజ్ చేస్తూ జాప్యం చేస్తున్నారు. ఈ ధైర్యంతో ఎంతమంది ఫిరాయించినా కూడా బాబు ఉన్నాడన్న ధైర్యంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ధీమాగా ఉన్నారు. తాజాగా నోటీసులు నేపథ్యంలో కోర్టు గట్టిగాజోక్యం చేసుకుంటే.. ఫిరాయింపు దారులు ఒక్కరోజులో మాజీ ఎమ్మెల్యేలు అయిపోగలరు. అసెంబ్లీ ముగిసిపోయే ఈ నాలుగు నెలలలోపైనా హైకోర్టు స్పందించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.